DailyDose

యువతిపై బాలుడి అత్యాచారం-నేరవార్తలు-10/31

21 Year Old File Rape Complaint On 15Year Old-Telugu Crime News Today-10/31

*పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం జరిపాడని 21 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడిపై రేప్‌ కేసు నమోదు చేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.
* గుంటూరు నగరం కొత్తపేటలోని బహుళ అంతస్తుల భవనంలో బుధవారం అర్ధరాత్రి భారీ పేలుడు చోటుచేసుకుంది. భవనంలో లాంగ్‌ లీవ్‌ మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో దుకాణం యజమాని రామారావు(40)తో పాటు మరో వ్యక్తి మృతి చెందాడు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి మృతిచెందాడు. అన్నపురెడ్డి మండలం బూరుగూడెంకు చెందిన పఠాన్ హజమత్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అటవీప్రాంతంలో గుప్తనిధుల కోసం వెళ్లారు.
* అప్పుడే పుట్టిన పసికందును అంతమొందించాలని చూసిన దుండగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌ సమీపంలో చోటుచేసుకుంది.
*మూడేళ్ల బాలికకు చాక్లెట్ ఆశ చూపి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి సంగారెడ్డి కోర్టు రూ. 5 వేలు జరిమానా, జీవిత కాలం జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
* వ్యభిచారం కేసులో నేరం రుజువు కావడంతో చీమల కృష్ణవేణికి మూడేళ్ల జైలు రూ.3 వేలు జరిమానా, చీమల కామాక్షయ్య, నరసింహులు సుబ్రహ్మణ్యం, వేలాయుధం భరణి, యారల శేషాద్రిలకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు, రూ. 5వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి డాక్టర్‌ బీ సత్యనారాయణ బుధవారం తీర్పు చెప్పారు.
* కావలి 2-టౌన్‌ పోలీసులకు సమాచారం అందడంతో 2013 మే 23వ తేదీన ఆ దంపతుల ఇంటిపై దాడి చేశారు.
* మెదక్‌ బాలికల గురుకుల పాఠశాలలో విషాదం నెలకొంది. పదో తరగతి విద్యార్థిని కావ్య అస్వస్థతతో మృతి చెందింది.
* వంతెనపై వెళ్తున్న ఓ కారు ఎదురుగా వచ్చిన ఆటోను తప్పించబోయి ప్రమాదవశాత్తు నదిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
* పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం జరిపాడని 21 ఏళ్ల యువతి 15 ఏళ్ల బాలుడిపై రేప్‌ కేసు నమోదు చేసింది. ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. సెక్షన్‌ 164 ప్రకారం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడైన మైనర్‌ను జువెనైల్‌ హోమ్‌కు తరలించారు.
*కర్ణాటకలోని తుమ్కురూ జిల్లాలోని కొరటగెరె వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.
*అడవిలో ఉండాల్సిన ఏనుగు గ్రామాలపై పడి బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్లు తొక్కేయడంతో ఐదుగురు మరణించారు. అసోంలోని గోల్పరా జిల్లాలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. మరణించినవారిలో ముగ్గురు మహిళలు, ఓ మైనర్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ‘లాడెన్’ అని పిలిచే ఈ ఏనుగు బారిన పడి ఇప్పటివరకు 50 మంది చనిపోయినట్లు స్థానికులు చెప్పారు.
*కస్తూర్బా పాఠశాలలో ఓ టెన్త్ విద్యార్థిని గర్భం దాల్చింది. అక్కడి పనిచేస్తున్న ఓ ఉద్యోగి భర్తే మాయమాటలు చెప్పి ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది.
*విశాఖపట్నం నగరంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై బుధవారం సాయంత్రం ఒక యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.
*నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం లత్తిపూర్-ఈరట్వానిపల్లి గ్రామాల మద్యలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శ్రీశైలం వెళ్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
* అసోంలో ఓ ఏనుగు వీరంగం సృష్టించింది. గోల్పారా జిల్లా బటైతారి గ్రామంలో లాడెన్ అనే ఏనుగు మంగళవారం రాత్రి చేసిన దాడిలో ముసలాయనతోపాటు చిన్నారి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. కోయినకోచి ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
*అడవిలో ఉండాల్సిన ఏనుగు గ్రామాలపై పడి బీభత్సం సృష్టించింది. కనిపించిన వారిని కనిపించినట్లు తొక్కేయడంతో ఐదుగురు మరణించారు. అసోంలోని గోల్పరా జిల్లాలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.
*చిత్తూరు జిల్లాదమరి మోర్దానపల్లె ఆంధ్రా బ్యాంకులో ఈనెల 14న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకులో పనిచేసే అప్ర్తెజర్‌ రమేష్‌ బ్యాంకులోని నగలు, నగదు దొంగతనం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
*ఒకే కుటుంబంలో నలుగురిని 15 రోజుల తేడాతో డెంగీ బలి తీసుకుంది. మొదట భర్త.. తర్వాత తాత.. అనంతరం కూతురును కోల్పోయిన నిండుగర్భిణి ఆ షాక్ నుంచి తేరుకోకముందే బాబుకు జన్మనిచ్చి తానూ ఊపిరి వదిలింది. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన పసిగుడ్డుకు సైతం ప్రాణాపాయం పొంచి ఉంది
*పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
*ఈనెల 14న మోర్దానపల్లె ఆంధ్రాబ్యాంకు బ్రాంచీలో దొంగతనం జరిగిందని బ్యాంకు జోనల్‌ మేనేజర్‌ మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 18 కేజీల బంగారు ఆభరణాలు, రూ.2.66 లక్షల నగదుతో పాటు సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్‌ను కూడా అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
*వ్యభిచారం కేసులో నేరం రుజువు కావడంతో చీమల కృష్ణవేణికి మూడేళ్ల జైలు రూ.3 వేలు జరిమానా, చీమల కామాక్షయ్య, నరసింహులు సుబ్రహ్మణ్యం, వేలాయుధం భరణి, యారల శేషాద్రిలకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు, రూ. 5వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి డాక్టర్‌ బీ సత్యనారాయణ బుధవారం తీర్పు చెప్పారు.
*విశాఖపట్టణంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కైలాసగిరిపై దారుణం జరిగింది. ఓ యువతిపై ముగ్గురు బాలురు, ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు
*ఆన్‌లైన్‌ మోసాలు రోజుకో రీతిలో వెలుగు చూస్తున్నాయి. మంగళగిరి మండలంలోని పెదవడ్లపూడికి చెందిన బాధితుడు తనకు జరిగిన మోసంపై గ్రామీణ మంగళగిరి ఠాణాలో బుధవారం ఫిర్యాదు చేశాడు.
*సరూర్నగర్లో నిర్వహించిన సకల జనభేరి సభకు వచ్చిన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందారు. కరీంనగర్-2 డిపోకు చెందిన నంగునూరి బాబు అనే డ్రైవర్ సరూర్నగర్ సభకు వచ్చారు. అక్కడ ఆయనకు గుండెపోటు రావడంతో సహచరులు సమీపంలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే డ్రైవర్ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు
*యూట్యూబ్ వేదికగా చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్న ఓ జంట చివరికి కటకటాలపాలైంది. ఇటీవల ఓ ఇంటిని చోరీ చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
*వరంగల్ జిల్లా నెక్కొండ మండంలో దారుణం చోటు చేసుకుంది. మడిపల్లి గ్రామంలో కేతియా అనే వ్యక్తి తల్లిదండ్రులను సజీవ దహనం చేశాడు. భూ తగాదాల నేపథ్యంలో కేతియా ఈ ఘోరానికి పాల్పడినట్లు సమాచారం. తండ్రి దశ్రు (65), తల్లి బాజీ (61)లను ఇంట్లోనే సజీవ దహనం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*కర్ణాటకలోని తుమ్కురూ జిల్లాలోని కొరటగెరె వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
* ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండలం సదరుపూర్ గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. వర్షం పడటంతో పత్తిలో కలుపు తీస్తున్న వ్యవసాయ కూలీలు చెట్టుకిందికి వెళ్లారు. పిడుగు పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.