DailyDose

కోట్లకు కోట్లే పట్టివేత–నేరవార్తలు–04/05

huge amounts of election money caught in andhra

* ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు బరి తెగిస్తున్నాయి. పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రలోభాలకు తెర తీశాయి. ఓటర్లకు నోట్ల కట్టలు వెదజల్లుతున్నాయి. లిక్కర్ ను భారీగా పంపిణీ చేస్తున్నాయి. ఇందుకోసం ఇతర ప్రాంతాల నుంచి మద్యం తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారుల తనిఖీల్లో భారీగా నగదు, లిక్కర్ పట్టుబడుతోంది.కృష్ణా జిల్లా ముసునూరులో ఏకంగా వాటర్ ట్యాంకర్ లో లిక్కర్ దాచిపెట్టారు. పోలీసులు తనిఖీలు చేయగా.. వెయ్యి 75 మద్యం సీసాలు లభ్యమయ్యాయి. ట్యాంకర్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కంచికచర్లలోనూ లిక్కర్ బయటపడింది. ఓ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులు.. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిన్న బంజారాహిల్స్ లో చేపట్టిన తనిఖీల్లో రూ.3.29 కోట్లు పట్టుకున్న పోలీసులు…ఈ కేసులో నిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ..నగదు పట్టుకుంటున్న ఘటనల్లో పౌరుల సహకారం బాగుందన్నారు. ప్రజలు ఇస్తున్న సమాచారంతోనే 70 శాతం నగదు పట్టుకున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజలు మరింత సహకరిస్తే ఎన్నికల్లో ధనప్రవాహం లేకుండా చూస్తామన్నారు. ఇప్పటివరకు నగరంలో రూ.9.45 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఎన్నికల నియామావళి ఉల్లంఘన కింద 200 కేసులు నమోదు చేశాం. 1869 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నగదు తరలింపు ఘటనల్లో వ్యక్తులపై వెంటనే కేసులు నమోదు చేయడం లేదని, విచారణ కోసమే వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నమని సీపీ చెప్పారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలపుడు నగదుతో పట్టుబడిన వారిలో 19మందికి శిక్షలు పడ్డాయన్నారు.
* శ్రీకాకుళంఆర్టీసీ బస్సులో భారీగా డబ్బు తరలించే యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.
రాజాం లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో 3 బ్యాగుల్లో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* భార్యా పిల్లలున్నా ఓ ప్రబుద్ధుడు ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేశాడు. వదిలించుకోవాలని చూడడంతో సదరు ట్రాన్స్ జెండర్ నానా రభస చేసింది. ఈ సీన్ చూసి భార్య పిల్లల్తో సహా పుట్టింటికి వెళ్లిం ది. తనను కుటుంబానికి దూరం చేసిందో ట్రాన్స్ జెండర్ కాబట్టి.. మొత్తం కమ్యూనిటీనే టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిన వ్యక్తిని సిటీ వెస్ట్ జోన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
* శ్రీకాళంజిల్లాలోని రాజాం లో భారీగా పట్టుబడిన నగదువిశాఖ నుండి పాలకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు లో రవాణా చేస్తున్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులువైసీపీ నేత పాలవలస విక్రంత్ కు చెందిన నగదు గా అనుమానంవిక్తంత్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నా రాజాం పోలీసులు
* నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు కూలీలు మరణించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని యశ్వంత్ పూర్ నగరంలో వెలుగుచూసింది. యశ్వంత్ పూర్ నగరంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగుగంటలకు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిందిఈ ఘటనలో ఇద్దరు మరణించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించారు.
* చెప్పుల్లో బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయి విమనాశ్రయంలో చోటుచేసుకుంది. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఓ ప్రయాణికుడి అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి రూ. 11 లక్షల విలువైన 381 గ్రాముల బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు.
* కర్ణాటకలో ఓ ఆదాయ పన్ను అధికారి నుంచి రూ.1.35 కోట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఆదాయ పన్నుల అధికారి హెచ్‌.ఆర్‌.నగేశ్‌ నివాసంలో గురువారం తనిఖీలు చేపట్టారు.
*కర్నూలు జిల్లా నంద్యాల ఎక్సైజ్‌ స్టేషన్‌లో ఉన్న నిందితుడు జయసింహారెడ్డిని శ్రీశైలం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, న్యాయవాది తులసిరెడ్డి బృందంతో వచ్చి తీసుకెళ్లిన ఘటన గురువారం చోటుచేసుకుంది.
*తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూరు వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో ఓ బస్సులో తరలిస్తున్న రూ.3.5 కోట్ల నగదును పట్టుకున్నారు. మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
* మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్‌లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
*బుద్ధిమాంద్యం గల తమ కుమార్తె నాలుగేళ్ల క్రితం తప్పిపోవడంతో ఆ తల్లిదండ్రులు నిరాశలో ఉన్నారు. అయితే వారిలో ఆనందాలు నింపింది తెలంగాణ పోలీసులు ‘దర్పణ్‌’ పేరుతో అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌. ఈ సాఫ్ట్‌వేర్‌ సహాయంతో బాలికను పోలీసులు కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఈ మేరకు సీఐడీ మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
*పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నగదు ప్రవాహం ఆగడం లేదు. గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో రూ.3.29కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు రవాణాను అడ్డుకోవడంపై దృష్టి పెట్టిన పోలీసులు బంజారాహిల్స్‌లో వాహనాల తనిఖీలు చేపట్టారు.
*ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. గురువారం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు, సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్‌)మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాంకెర్‌ జిల్లా పర్కాపూర్‌ అటవీ ప్రాంతంలోని మహ్లా గ్రామం వద్ద ఈ సంఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
*హైదరాబాద్‌లో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన రూ.2 కోట్ల నగదు వ్యవహారంలో సైబరాబాద్‌ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఆ సొమ్మును రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌కు అందించేందుకే తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
* సోదరుడి ఆత్మహత్య, అందుకు కారణమైన వర్గంపై పగ.. అతడిని కరడుగట్టిన నేరగాడిగా మార్చాయి. హైదరాబాద్‌లోనే కాక దిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, ఇతర ప్రాంతాల్లోనూ దారిదోపిడీలకు పాల్పడిన వెంకట్‌ అనే ఆ వ్యక్తిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
*హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హబ్సిగూడ స్ట్రీట్‌ నెంబర్‌-3లో గురువారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ జరిపిన దాడుల్లో రూ. 47,75,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఉస్మానియా పోలీసులకు అప్పగించారు. శ్రీధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరేశ్‌రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు మల్కాజిగిరి నియోజకవర్గనికి చెందిన ఓ రాజకీయ నాయకుడికి చెందిన డబ్బును తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*సంగారెడ్డి జిల్లాలోని అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు, కంటెయినర్ ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
* అక్రమ సంబంధం నేపద్యంలో ఓ డిప్యూటీ కలెక్టర్ పై హత్యయత్నం.తన భార్యతో ఇంట్లో దోరికిన ఓ మీడియా ప్రతినిధి.
భార్యతో కలసి డిప్యూటీ కలెక్టర్ ని చంపేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధి.తప్పించుకున్న డిప్యూటీ కలెక్టర్.పట్టాబిపురం స్టేషన్ లో డిప్యూటీ కలెక్టర్ ఫిర్యాదు.కేసు నమోదు చేయకపోవడంతో ఎస్పీని కలిసిన డిప్యూటీ కలెక్టర్.
ఎస్పీ ఆదేశాలతో రిపోర్టర్, డిప్యూటీ కలెక్టర్ బార్యపై కేసు నమోదు.డిప్యూటీ కలెక్టర్ పై ఎస్పీకి మరో ఫిర్యాదు చేసిన భార్య.
నగరంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన.
* మహిళను అత్తింటి వారు దారుణంగా వెంటాడి, అత్యంత క్రూరంగా హింసించిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లోని కమ్మనహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. మహిళను నడిరోడ్డుపై ఆమె మరిది సహా అతడి కుటుంబ సభ్యులు రాళ్లతో, చెప్పులతో కొట్టడంతో పాటు దుస్తులను లాగి కత్తితో పొడిచేందుకు ప్రయత్నించడంతో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. తనపై దాడికి తెగబడిన మరిది, అతని కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బాధితురాలు బనస్‌వాడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.