* ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోలేకపోతున్న ఎయిర్‌టెల్ 3జీ సేవలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయితే, 2జీ సేవల విషయంలో మాత్రం ఖాతాదారులకు ఊరటనిచ్చే ప్రకటన చేశారు. 2జీ నెట్‌వర్క్ నుంచి ఆదాయం వస్తున్నంత కాలం వాటి సేవలు కొనసాగుతాయిని స్పష్టం చేశారు. అలాగే, 2జీ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లు తీసుకొస్తూనే ఉంటామని వివరించారు.
* పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ‘‘గోల్డ్ ఆమ్నెస్టీ’’పేరుతో కొత్త స్కీమ్ తీసుకురానున్నట్లు వస్తోన్న వార్తలను గురువారం కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు కొట్టిపారేశాయి. ఇలాంటి ప్రపోజలేదీ లేదని, బడ్జెట్ తయారుచేసే టైమ్లో ఇలాంటి పుకార్లు రావడం సహజమేనని అధికారులు తెలిపారు. బ్లాక్ మనీ వెలికితీసేందుకు గతంలో ‘స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం’ తరహాలోనే పరిమితికి మించి ఉన్న బంగారాన్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించే పథకాన్ని మోదీ సర్కార్ ప్రవేశపెట్టబోతోందంటూ బుధవారం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
* డేంజర్ జోన్‌లో డీహెచ్‌ఎఫ్‌ఎల్ దివాన్
హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (ఎఫ్‌డీలు)లో డబ్బులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు భయంతో వణుకుతున్నారు. ఈ కంపెనీ అక్రమంగా నిధులు మళ్లించిందని, మోసాలకు పాల్పడ్డదనే ఆరోపణలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఏ క్షణంలోనైనా దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధులను మళ్లించారని కేపీఎంజీ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ తేల్చడమే ఇందుకు కారణం. దీంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్ రిజల్యూషన్ ప్లాన్ కూడా అమలయ్యే అవకాశాలు తగ్గిపోయాయి. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు మొదలైతే ఎఫ్‌డీలు సహా అన్ని రకాల చెల్లింపులను కంపెనీ నిలిపివేయాల్సి ఉంటుంది. బ్యాంకులు ఈ కంపెనీకి రూ.38,342 కోట్ల వరకు అప్పులు ఇచ్చాయి. వీటికి కూడా రీపేమెంట్లు చేయడం సాధ్యపడదు. డిపాజిటర్లతోపాటు బ్యాంకులకూ ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
*స్టాక్ మార్కెట్లో షేర్లు నమోదైన బ్యాంకుల విషయంలో సెబీ నిబంధనలు మరింత కఠినం చేసింది. ఈ బ్యాంకుల మొండి బకాయిలు (ఎన్పీఏ), వాటి కోసం చేసే కేటాయింపుల మార్పుకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా, ఆ విషయాన్ని 24 గంటల్లో వెల్లడించాలని ఆదేశించింది
*నిఫ్టీ మరింత అప్ట్రెండ్లో ప్రారంభమై 11950 వరకు వెళ్లింది. ఆ స్థాయిలో ఇంట్రాడే రియాక్షన్ సాధించినా చివరికి 37 పాయింట్ల లాభంతో క్లోజయింది.
*అమెరికా-ఇటలీ ఆటో దిగ్గజం ఫియట్ క్రిస్లర్ (ఎఫ్సీఏ)… ప్యూజియో, సిట్రాన్ కార్లను తయారు చేస్తున్న ఫ్రాన్స్ గ్రూప్ పీఎ్సఏలు విలీనమవుతున్నట్టు గురువారం ప్రకటించాయి.విలీన కంపెనీల్లో రెండు కంపెనీలకు సమభాగస్వామ్యం ఉండనుంది.
*ఫేస్బుక్ యూజర్ల సంఖ్య, గత ఏడాదితో పోలిస్తే ఈ సెప్టెంబరులో 9 శాతం పెరిగి 162 కోట్లకు చేరింది. సెప్టెంబరులో మొత్తం యాక్టివ్ యూజర్లలో ఇది 66 శాతమని ఫేస్బుక్ పేర్కొంది. భారత్ మార్కెట్ ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించిందని తెలిపింది.
*నాస్కామ్ ఫౌండేషన్తో కలిపి డీబీఎస్ ఏషియా హబ్ 2 (డీఏహెచ్2) హైదరాబాద్లో డిజిటల్ లిటరసీ కేంద్రాన్ని ప్రారంభించింది. డీఏహెచ్2కు హైదరాబాద్లో ఇది తొలి డిజిటల్ లిటరసీ కేంద్రమని డీబీఎస్ బ్యాంక్ వెల్లడించింది.
*ఉబ్బసం (టీబీ) వ్యాధి నిర్ధారణ పరీక్ష వ్యయాన్ని తగ్గించే కొత్త మాలిక్యులర్ టీబీ పరీక్షను ట్రాన్సేషియా బయోమెడికల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.పూర్తి ఆటోమేటెడ్ మాలిక్యులర్ పరీక్ష వ్యవస్థ ఎంఎక్స్ 16ను విడుదల చేసింది
బంగారం పథకాలు వదంతులే-వాణిజ్యం-11/01
Related tags :