మీరు అడిగిన ప్రశ్నలకు గుడ్డుపైన ఒక పుస్తకమే రాయొచ్చు. ఒక రోజు ఒక వ్యక్తి సేఫ్‌గా రెండు గుడ్లు నిరభ్యంతరంగా తినొచ్చు. రెండు గుడ్లు కూడా పచ్చసొనతో పాటు తినొచ్చు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ కాంపౌండ్స్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. రెండు గుడ్ల లిమిట్‌ను దాటకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. పైగా బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది కాలేయాన్ని (లివర్) నియంత్రిస్తుంటుంది. మనం తీసుకునే ఆహారంలో సరిపడా కొలెస్ట్రాల్ లేకపోతే లివర్ తయారు చేస్తుంది. అలాగే ఆహారం ద్వారా కొలెస్ట్రాల్ ఎక్కువగా తీసుకుంటుంటే లివర్ దాన్ని నియంత్రిస్తుంటుంది. కాబట్టి లివర్ మెటబాలిజం దెబ్బతిన్నప్పుడే కొలెస్ట్రాల్ వ్యవస్థ మారుతుంది.
పచ్చసొనలో ఫ్యాట్ కాంపౌండ్స్‌తో పాటు కొన్ని ముఖ్యమైన పోషకాలుంటాయి. ముఖ్యంగా ఫ్యాట్ సొల్యూబుల్ విటమిన్స్ ఎ,డి,ఈతో పాటు హార్మోన్లను ప్రభావితం చేసే కాంపౌండ్స్ కూడా ఉంటాయి.రోజూ ఉదయాన్నే ఒక గుడ్డు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు తీసుకుంటే సమతులం అవుతుంది.రాత్రి భోజనంతో పాటు ఒక గుడ్డు తింటే శరీరంలో అన్ని వ్యవస్థలు సవ్యంగా ఉంటాయి. గుడ్డు ఉదయాన ఒక పని, రాత్రి ఇంకో పని ఎలా చేస్తుందనే అనుమానం రావొచ్చు. గుడ్లు మాత్రమే కాదు అన్ని ఆహార పదార్థాలు కూడా మన శరీర అవసరాన్ని బట్టి విధులు నిర్వహిస్తాయి. ఉదాహరణకు ప్రొటీన్ ఎక్కువ తీసుకొని ఎనర్జీ బాగా తగ్గితే, ప్రొటీన్లు ఎనర్జీగా మారుతాయి. అందువల్లే ఎప్పుడైనా సమతుల ఆహారం అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.