DailyDose

మహిళ తహశీల్దారు సజీవదహనం-నేరవార్తలు-11/04

Lady MRO Burnt To Death-Telugu Crime News Today-11/04-మహిళ తహశీల్దారు సజీవదహనం-నేరవార్తలు-11/04

* రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తహసీల్దార్ కార్యాలయంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. ఈ క్రమంలో తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు రెవెన్యూ సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
* ఇందారంలోని పోచమ్మవాడకు చెందిన మినుగు సుజాత గోదావరి నదిలో దూకి ఆత్మహత్య యత్నంకి పాల్పడింది.. ఆమె భర్త రోజు మద్యానికి బానిసై త్రాగుతూ కొడుతున్నాడని ప్రతిరోజు విపరీతమైన బూతులు తిడుతుండటంతో మానసికంగా కుంగిపోయి తన కుమారుడైన అజయ్ తీసుకొని గోదావరి బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయతించింది… పోలీస్ టీం కాపాడి కుటుంబ సభ్యుల వివరములు తెలుసు కొని శ్రీరాంపూర్ సిఐ కోటేశ్వర్ కు కౌన్సిలింగ్ నిమిత్తం అప్పగించారు
* వరంగల్ రూరల్ జిల్లాలోని రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లయ్య(40) ఇంటి వద్ద బోర్ మోటర్ రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి కిందపడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
* రంగారెడ్డిజిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణం చోటుచేసుకుంది. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
* కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది.
* మీర్‌పేట్‌లోని తీగల రాంరెడ్డి (టీఆర్‌ఆర్‌) కాలేజీలో విషాదం చోటేచేసుకుంది. పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
* ప్రకాశం జిల్లాలోని కారంచేడు వైపు నుంచి చీరాల వస్తున్న ఓ మారుతీ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లింది.
* రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు.
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బోటు వెలికితీసినందున ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. కచ్చులూరు తరహా బోటు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు రూపొందించాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్‌ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.న్1 రొద్దు ప్రమదం ప్సి స్య్స్తీం విచరన
*ఆకాశవాణి టవర్ ఎక్కి గ్రామ సచివాలయ నిరుద్యోగుల ఆందోళన జగనన్న జాబ్ ఇవ్వన్న అంటూ నినాదాలు
పెట్రోల్ బొటీల్లతో సచివాలయం నిరుద్యోగ మహిళల నిరసనసీఎం జగన్ వెంటనే స్పందించి మాతో మాట్లాడాలివెంటనే స్పందించాలి లేదంటే పెట్రోల్ పోసుకుంటాం అంటున్న బీఎస్సీ బిజ్డ్ సి నిరుద్యోగులుముందస్తు జాగ్రత్త కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఫైర్ రెస్క్యూ టీం
*వివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి రెచ్చగొట్టే పోస్టులను పెట్టి, శాంతిభద్రతల సమస్యలకు కారణమయ్యే వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్ర డీజీ ఓ.పి. సింగ్‌ హెచ్చరించారు.
*తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గౌతమి బ్రిడ్జి సమీపంలో గల తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి కారులును తీసుకువెళ్తున్న ఓ కంటైనర్ సోమవారం తెల్లవారు జామున దూసుకుపోయింది
*ఏపీ మంత్రి పేర్ని నాని తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపిస్తూ మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జ్ ఆర్ఎంవో విజయనిర్మల నిరాహారదీక్షకు దిగారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగం నాయకులు తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని, దీనిపై స్పందించిన మంత్రి ఎటువంటి విచారణ లేకుండానే తనను ఏకపక్షంగా విధుల నుంచి తొలగించారని విజయ నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షను విరమించబోనని అన్నారు. తాను ఏం తప్పు చేశానని తనపై మంత్రి కక్ష సాధిస్తున్నారో చెప్పాలని విజయ నిర్మల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
*కృష్ణాజిల్లాగన్నవరం లో భారీ నగదు చోరీ..చిన్న అవుటపల్లి కి చెందిన భార్గవి నగర్ వెంచర్ లో ఘటన …ఆగివున్న కారులో ని 16 లక్షలు మాయంషేక్.శిలార్ అనే వ్యక్తి యొక్క కారు అద్దాలు పగులగొట్టి తీసుకెళ్లారు. గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
*పెన్పహాడ్ మండలం మొరసకుంటలో ఇద్దరు దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దంపతులు మృతి చెందిన విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
*తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
*బిహార్లో ‘ఛట్’ పర్వదిన ఉత్సవాల సందర్భంగా సంభవించిన వేర్వేరు సంఘటనల్లో మొత్తం 30 మంది మరణించారు. మృతుల్లో మొత్తం 18 మంది చిన్నారులున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం సూర్యకుండ్ సమీపంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పిల్లలు మరణించారు. ఇక, వివిధ జిల్లాల్లో నీళ్లల్లో మునిగిపోయి మొత్తం 26 మంది మృతి చెందగా వారిలో 16 మంది పిల్లలున్నారు.
*అనారోగ్యంతో మరణించిన భార్య అంత్యక్రియలను ముగించుకుని కుటుంబ సభ్యులతో తిరిగి వస్తుండగా చెరువులోకి దిగి ప్రమాదవశాత్తూ భర్త మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం బూరుగుపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది.
*నిద్రమత్తు, అతివేగం ఐదుగురు యువకుల ప్రాణాలను బలి తీసుకుంది. డ్రైవరు నిద్రమత్తులో ఉండటంతో కారు డివైడరును తాకి పల్టీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది.
*జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పీఏ గల్లంతయ్యారు. అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కాల్వలో ఈతకు దిగిన ఎమ్మెల్యే పీఏ గిరీశ్ కనిపించకుండా పోయారు.
*నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. డోల్ఖాలోని దౌరాలి నుంచి రాజధాని కాఠ్మాండూ వెళ్తున్న బస్సు సుంకోషి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
*అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో 16మందికి తీవ్ర గాయాలయ్యాయి.
*తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఈ ఘటన జరిగింది.
*అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం సమీపంలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు చనిపోయారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు.
*చదివితే ఉన్న మతి పోయిందని సామెత. రోగులకు ఆధునిక వైద్య సేవలందించవలసిన ఆస్పత్రిలోనే భూతవైద్యం అందించిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షియోపూర్లో చోటుచేసుకుంది
*హైదరాబాద్ నగరంలోని బోరబండలో వీధిరౌడీలు హల్చల్ చేశారు. దౌర్జన్యంగా కిరాణా దుకాణంలోకి ప్రవేశించి వ్యాపారిపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
*కార్మిక బీమా వైద్యసేవల సంస్థ మందుల కొనుగోలు కుంభకోణంలో మరొకరిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అరెస్టు చేశారు. తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్రెడ్డి సోదరుడు శ్రీనివాస్రెడ్డిని అరెస్టు చేసిన అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు.
*ప్రేమించి పెళ్లాడిన భార్యను సరిగా చూసుకోలేకపోతున్నా..రెండు సంవత్సరాలు నిండని కుమార్తె కనీస అవసరాలను సైతం తీర్చలేకపోతున్నానన్న బాధతో ఓ లారీ క్లీనర్ తన పుట్టిన రోజునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
*ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
*దేవరకొండ లో విధులు నిర్వహిస్తన్తున్న జైపాల్ రెడ్డి అనే ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై నేటికి 31వ రోజుకు చేరుకుంది. అయినా, కార్మికులు పట్టుసడలకుండా తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్లైన్ కూడా పట్టించుకోకుండా సమ్మెను ఉధృతం చేస్తున్నారు.
*అనారోగ్యంతో మాజీ ఎమ్మెల్యే చదలవాడ జయరాంబాబు(72) మృతి చెందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. బీసీ కార్పొరేషన్ ఛైర్మన్గా కూడా ఆయన సేవలు అందించారు. చివరి వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాగా, చదలవాడ అంత్యక్రియం రేపు మధ్యాహ్నం గుంటూరులో జరుగనున్నారు. ఆయన మృతికి పలువురు సీనియర్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
*తాడేపల్లి వారది దగ్గర పశుమాంసం (ఆవు,గేదె) తరలించే కంటైనర్ అదుపులోకి తీసుకున్న తాడేపల్లి పోలీసులు.