Devotional

కార్తిక సోమవారం ప్రత్యేకత ఇదే

What is so special about kartheeka somavaram-Telugu devotional news

శివుడికి కార్తికమాసం ప్రీతిపాత్రమని చెప్తారు. శివుడు చంద్రుడి తపస్సుకు మెచ్చి అతణ్ణి అనుగ్రహించాడు. చంద్రుడు తన పదహారు కళలలో ఒకటి పరమేశ్వరుడికి సమర్పించగా, ఆ కళను తలపై ధరించి ఆయన సోమశేఖరుడయ్యాడు. సోమ శబ్దానికి చంద్రుడు అనే అర్థంతోపాటు ఉమతో కూడినవాడు అనే అర్థంకూడా ఉంది. అంటే అర్ధనారీశ్వరుడు. ఆ పేరుతో ఉన్న సోమవారం, అది కూడా కార్తిక సోమవారం శివుడికి ప్రీతిపాత్రమై ప్రసిద్ధి పొందింది. కార్తిక సోమవారం నాడు నదీస్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, శివార్చన, రుద్రాభిషేకం భక్తితో నిర్వహించాలని పెద్దలు చెబుతారు.
1.కార్తీక సందడి
యాదాద్రి పుణ్య క్షేత్రంలో ఆదివారం భక్తులు నిర్వహించిన కార్తీక వ్రతాలతో కోలాహలం నెలకొంది. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీ. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు వ్రతాలు నిర్వహించే భవనంలో సరైన వసతులు లేక వృద్ధులు, మహిళలు ఇబ్బంది పడ్డారు.
2.ముస్లిం భక్తుడి ఇంటికి చినజీయర్ స్వామి
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రంపచోడవరంలో ముస్లిం భక్తుడు సాదిక్ హుస్సేన్ ఇంటికి ఆదివారం చినజీయర్స్వామి వచ్చారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తనను కలిసేందుకు వచ్చిన భక్తులను ఆశీర్వదించారు. సర్వప్రాణుల రక్షణే మాధవసేవ అని ఈ సందర్భంగా చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఐక్యతతో సమాజ శాంతి కోసం పనిచేస్తే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. రాగ ద్వేషాలకు తావులేకుండా సంపూర్ణ ఆత్మశాంతిని కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటు సేవాభావం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
3. శ్రీశైల దేవస్థానానికి రూ.2 లక్షల విరాళం
శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి, కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమానికి మొత్తం రూ.2 లక్షల విరాళాన్ని భక్తులు సమర్పించా రు. ఆదివారం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి గుంటూరుకు చెందిన ఎన్.బాసిరెడ్డి రూ.1,00,232 విరాళాన్ని దేవస్థాన కార్యనిర్వహణాధికారికి అందజేశారు. ఆయన వారికి స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను, అన్నదానం బాండ్ను అందించి సత్కరించారు.
4. శైలంలో భక్తుల రద్దీ
కార్తీకమాసం మొదటి ఆదివారం శ్రీగిరి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో రద్దీ కనిపించింది. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కృష్ణవేణికి వాయనాలు సమర్పించారు. కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదిలారు. ఆలయం ముందు గంగాధర మండపం వద్ద, నాగులకట్ట వద్ద కార్తీక దీపాలను వెలిగించేందుకు పోటీ పడ్డారు.
5. వైభవంగా మహారుద్రాభిషేకం
లోక కల్యాణార్థం విశాఖ సాగర తీరంలో ఆదివారం నిర్వహించిన మహారుద్రాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. జ్ఞానప్రసన్న స్వామి నేతృత్వంలో స్వామి సేవకులు విశేష అభిషేకాలు నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంతో బీచ్రోడ్డులో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ముందుగా పవిత్ర జలాలతో లింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం గుంటూరు అమ్మ ఆశ్రమం సేవకుల ఆధ్వర్యంలో అనాథ శవాల చితాభస్మంతో మహాభస్మాభిషేకాన్ని నిర్వహించారు. అదేవిధంగా అష్టోత్తర నామార్చన, ధూప సేవ, హారతి చేపట్టారు.
6. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పంపా నదిలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సప్త గోదావరిలో భక్తులు స్నానమాచరించి కార్తీక దీపాలు వదిలారు.
7. నవంబరు 8 నుండి 12వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ”మనగుడి”
ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నవంబరు 8 నుండి 12వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శైవాల‌యాల్లో 21వ విడత మనగుడి కార్యక్రమం జరుగనుంది.ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల్లో జిల్లాకు ఒక‌టి చొప్పున శివాల‌యాల‌ను ఎంపిక చేసి 5 రోజుల పాటు కార్తీక‌మాస విశిష్ట‌త‌పై ధార్మికోప‌న్యాసాలు నిర్వ‌హిస్తారు. ఒక్కో జిల్లాలో 5 చొప్పున ఆల‌యాల‌ను ఎంపిక చేసి న‌వంబ‌రు 9న కైశిక ద్వాద‌శి ప‌ర్వ‌దినం నిర్వ‌హిస్తారు.జిల్లాకు ఒక‌టి చొప్పున శివాల‌యంలో లేదా టిటిడి క‌ల్యాణ‌మండ‌పంలో న‌వంబ‌రు 11న కార్తీక దీపోత్స‌వం చేప‌డ‌తారు.
8. శుభమస్తు నేటి పంచాంగం
తేది : 4, నవంబర్ 2019
సంవత్సరం : వికానామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకమాసం
ఋతువు : శరత్ ఋతువు
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు రాత్రి తెల్లవారుజాము 5 గం॥ 41 ని॥ వరకు)
నక్షత్రం : శ్రవణము
(ఈరోజు రాత్రి తెల్లవారుజాము 5 గం॥ 4 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : భద్ర (విష్టి)
వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 39 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 21 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 00 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 51 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 58 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 43 ని॥ లకు
9. చరిత్రలో ఈ రోజు 04, నవంబర్
సంఘటనలు
1869: నేచర్ (పత్రిక) అనేది ఒక ప్రసిద్ధ బ్రిటీష్ వైజ్ఞానిక పత్రిక. ఇది 1869 నవంబర్ 4న మొదటిసారి ప్రచురించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన బహుళ శాస్త్రీయ విభాగాల పత్రికగా ఇది పరిగణించబడుతుంది.
2004: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు.
1947: భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్రపురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.
1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.
జననాలు
1845: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1883)
1889: జమ్నాలాల్ బజాజ్, ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (మ.1942)
1922: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (మ.1996)
1925: రిత్విక్ ఘటక్, ఒక బెంగాలీ భారతీయ చిత్రనిర్మాత మరియు స్క్రిప్టు రచయిత (మ.1976).
1929: శకుంతలా దేవి, ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్ 203) (మ.2013).
1932: వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్ మరియు జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015)
1944: పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
మరణాలు
1980: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (జ.1923)
2007: అర్జా జనార్ధనరావు, ప్రసిద్ధ తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (జ.1926)
10. వారి సేనాధిపతి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ వసంతమండపానికి చేరుకున్నారు. భూమిపూజ, మృత్సంగ్రహణం కార్యక్రమాల తర్వాత ప్రదక్షిణంగా ఆలయానికి చేరుకున్నారు. వసంతమండపంలో సేకరించిన పుట్టమన్నుతో అర్చకులు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు సన్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 8 టన్నుల పూలతో పుష్పకైంకర్యాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల నుంచి చామంతి, సంపంగి, రోజా, మరువం, దవనం, తులసి, గన్నేరు, నందివర్ధనం వంటి సాంప్రదాయ కుసుమాలు సేకరించారు.
11. రాశిఫలం – 04/11/2019
తిథి:
శుద్ధ అష్టమి రా.తె.5.33 , కలియుగం-5121 , శాలివాహన శకం-1941
నక్షత్రం:
నక్షత్రం: శ్రవణం రా.తె.4.53
వర్జ్యం:
ఉ.7.26 నుండి 9.08 వరకు
దుర్ముహూర్తం:
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం:
ఉ.7.30 నుండి 9.00 వరకు తీవిశేషాలు: గోష్టాష్టమి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా వుంటారు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుతుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుంటాయ. క్రొత్తపనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
మకరం: (ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తిఅవుతాయి.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్థిరాస్తుల విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది.ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా నుండుట మంచిది. అనారోగ్య బాధలుండవు.
12. బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞానక ర్త శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి 411వ జయంతి మహోత్సవా లు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఘనం గా నిర్వహిస్తున్నట్లు మఠం మేనేజర్‌ ఎన్‌.ఈశ్వరయ్యాచారి తెలిపారు. ఈ సందర్భంగా ఆ యన ఆదివారం మాట్లాడుతూ స్వామివారి ఏకాదశోత్త చతుశ్శతి జయంతి మహోత్సవాల ను ఆలయ ప్రాంగణంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 9వ తేదీ శనివారం కార్తీక శుద్దద్వాదశి రోజున స్వామివారు అవతరించా రని తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ఆలయ ప్రాం గణంలో ప్రత్యేక పూజలతో పాటూ పార్కులో వెలసిఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి శిలావిగ్రహానికి మఠాధిపతిచే క్షీరాభిషేకం నిర్వహిస్తున్న ట్లు చెప్పారు.
13. శ్రీరస్తు శుభమస్తు
తేది : 4, నవంబర్ 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : కార్తీకసం
ఋతువు : శరత్ఋతువు
కాలము : వర్షాకాలం
వారము : ఇండువాసరే (సోమవారం)
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 56 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 4 గం॥ 57 ని॥ వరకు అష్టమి తిధి తదుపరి నవమి తిధి)
నక్షత్రం : శ్రవణం
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 55 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం॥ 23 ని॥ వరకు శ్రవణం నక్షత్రం తదుపరి ధనిష్ట నక్షత్రం )
యోగము : (శూల ఈరోజు ఉదయం 6 గం ll 28 ని ll వరకు తదుపరి గండ రేపు ఉదయం 7 గం ll 0 ని ll వరకు)
కరణం : (భద్ర (విష్టి) ఈరోజు సాయంత్రం 3 గం ll 56 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు ఉదయం 11 గం ll 59 ని ll)
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 20 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 6 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 55 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 41 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 9 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 12 గం॥ 55 ని॥ వరకు)(ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 26 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 12 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 25 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 50 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 59 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 16 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 44 ని॥ లకు
సూర్యరాశి : తుల
చంద్రరాశి : మకరము
తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవము
14. నేటి సామెత పందిని పొడిచే వాడే బంటు
పందిని వేటాడ్డం అంత సులభం కాదు. దాని శరీరానికి ఎంత దెబ్బ తగిలినా సులభంగా చావదు. క్రింద పడిపోడు. అలాగే పారిపోగలదు లేదా మీదికి దాడి చేయగలదు. అందుచేతనే పందిని పొడిచే వాడే బంటు అని సామెత పుట్టింది.
15. నేటి ఆణిముత్యం
పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయు
పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము:
పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ ఏదైనా ఒక పనిని మొదలుపెడితే… సాధ్యం కాకపోయినప్పటికీ చివరివరకు పట్టుదలతో దానిని పూర్తిచేయాలి. పట్టుదలను వదలడం కంటే.. ప్రాణాలను వదలడం మేలు.
16. తిరుమల \|/ సమాచారం *
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు సోమవారం,
04.11.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 17C°-26℃°
• నిన్న 83,657 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 4
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
8 గంటలు
పట్టవచ్చును,
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.39 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
3 గంటల సమయం
పట్టవచ్చును,

గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
వయోవృద్దులు / దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free #18004254141
తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం
కోసం క్రింద లింకు ద్వారా చేరండి
https://t.me/joinchat/AAAAAEHgDpvZ6NI-F2C7SQ
17. విజయవాడ: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కృష్ణా నదికి భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో పుణ్యస్నానమాచరించి దుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం శ్రావణ నక్షత్రంతో కార్తీక మొదటి సోమవారం రావడం అరుదు అని భక్తులు పేర్కొంటున్నారు. ఈ రోజు పుణ్యస్నానం ఆచరిస్తే కోటి సోమవారాలు ఆచరించినంత పుణ్యమని భక్తులు పేర్కొంటున్నారు.
18. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ..
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే టైం స్లాట్ సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, సోమవారం శ్రీవారి ఆలయంలో సోమవారం జరగనున్న పుష్పయాగం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
ఆలయంలో మూలవిరాట్‌ ఎదురుగా ఉదయం 6 గంటలకు ఆచార్య రుత్విక్‌వరణం నిర్వహించారు. అర్చకులకు విధుల కేటాయింపునే రుత్విక్‌వరణం అంటారు.
19. మన ఇతిహాసాలు గంగ
గంగ గురించి, గంగావతరణం గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవీ భాగవతంలోను గంగను గూర్చి పెక్కు గాథలున్నాయి.జగజ్జనని (అంతర్ధానాంశయై) నిరాకారయైన గంగ బ్రహ్మదేవుని కమండలువునందుండెను. ఒకమారు శంకరుడు రాగము లాలాపించినపుడు నారాయణుడు ద్రవీభవించెను. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలువును తాకించగా నిరాకార గంగ జలమయమయ్యెను. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినపుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణుపాదమును కడిగెను. (బ్రహ్మ కడిగిన పాదము – అన్నమయ్య కీర్తన). ఆ పాదమునుండి ప్రవహించునదే దివ్యగంగ.సూర్యవంశపు రాజైన సగరునకు వైదర్భి, శైబ్య అను ఇద్దరు భార్యలు. శైబ్యకు అసమంజసుడను కుమారుడు, వైదర్భికి 60వేల మంది కుమారులు కలిగిరి. సగరుని అశ్వమేధ యాగాన్ని భంగం చేయడానికి ఇంద్రుడు యాగదేనువును పాతాళంలో దాచాడు. ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళిన సగరుని 60వేల మంది పుత్రులు కపిల మహాముని శాపమున భస్మమై పోయారు. వారికి ఉత్తమగతులు లభించాలంటే దివిజ గంగను పాతాళానికి తేవలసి ఉంది. సగరుడు, అతని కొడుకు అసమంజసుడూ తపసు చేసినా ప్రయోజనం లేకపోయింది. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. ఆంశుమంతుని కొడుకు భగీరధుడు.భగీరధుడు తన తాతలకు ఉత్తమ గతులు ప్రాప్తించాలని గంగకోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై “నేను భూమి మీదికి దిగిరావడానికి సిద్ధంగా ఉన్నాను. కాని నా దూకుడు భరించగల నాధుడెవ్వరు?” అని అడిగింది. భగీరధుడు శివునికోసం తపసు చేశాడు. అనుగ్రహించిన శివుడు దిజ గంగను భువికి రాగానే తన తలపైమోపి, జటాజూటంలో బంధించాడు. భగీరధుని ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదలాడు. భగీరధుని వెంట గంగ పరుగులు తీస్తూ సాగింది. దారిలో జహ్నముని ఆశ్ర్రమాన్ని ముంచెత్తి, “జాహ్నవి” అయ్యింది. ఆపై సాగరంలో ప్రవేశించి, పాతాళానికి చేరి, సగరుని పుత్రులకు ఉత్తమ గతులను కలుగజేసింది. (‘ (ఈ కథ బాపు దర్శకత్వంలో సీతాకళ్యాణం అనే తెలుగు సినిమాలో కన్నుల పండువుగా చిత్రీకరింపబడింది.)స్వర్గంలో “మందాకిని”గా, భూలోకంలో “గంగ” లేదా “అలకనంద”గా, పాతాళంలో “భోగవతి”గా మూడు లోకాల్లో ప్రహించినందున గంగను “త్రిపథగ” అంటారు.
20. కార్తీక మాస మొదటి సోమవారం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీపాలు వెలిగిస్తూ పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అభిషేకాలతో పూజిస్తున్నారు. ప్రముఖ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఇదే రోజు కోటి సోమవారం అవడం మరింత విశేషమని పండితులు చెప్పారు.తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణాలు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి వ్రతాలు, 4 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించారు. ముమ్మడివరం మురమల్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.. యానం వద్ద గోదావరిలో నీరు తక్కువగా ఉండడంతో జల్లు స్నానాలు ఆచరించిన భక్తులు గోదావరిలో దీపాలను వదిలారు. పి.గన్నవరం లోని గరుడ స్వామి, కారేపల్లి అగ్రహారంలోని పార్వతి సోమేశ్వర స్వామి, బెల్లంపూడి లోని లక్ష్మీశ్వర స్వామి, పుల్లేటికుర్రు వ్యాఘ్రేశ్వర స్వామి, ముక్తేశ్వరం ముక్తికాంతా క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తజన సంద్రంగా మారాయి.పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లోని గోకర్ణేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి, పంచారామ క్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తణుకు పాతవూరు సిద్ధేశ్వరాలయం, కపర్ధీశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది.గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో కార్తీక సాగర హారతి నిర్వహించారు. ఉపసభాపతి కోన రఘుపతి హారతి ఇచ్చారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ వేద పండితులచే కార్తీక సాగర హారతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పల్నాడు దైద అమరలింగేశ్వర స్వామి దేవాలయం, పిడుగురాళ్ల పట్టణంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయం, మాచవరం శ్రీ బొగ్గ మల్లయ్య దేవస్థానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారు జాము మూడు గంటల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.