వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్‌గేల్ సోమవారం ఓ విమానయాన సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ప్రయాణించాల్సిన ఎమిరేట్స్ విమానానికి సంబంధించి టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ.. తనను అనుమతించకపోవడంపై మండిపడ్డాడు. ట్విటర్ వేదికగా ‘ఎమిరేట్స్ సంస్థ తీవ్ర నిరాశకు గురిచేసింది. నా టికెట్ కన్ఫర్మ్ అయినా విమానం ఓవర్ బుకింగ్ అయిందని నాతో చెప్పారు. అదిమాత్రమే కాదు.. బిజినెస్ క్లాస్ టికెట్ తీసుకున్న నన్ను ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించేలా చూశారు. ఈ నేపథ్యంలో నేను తదుపరి విమానంలో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది చాలా దారుణం. చేదు అనుభవం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసే ఎమోజీని జత చేశాడు.
గేల్ గుస్సా
Related tags :