WorldWonders

గిరిజన అమ్మాయికి 2019 సివిల్స్‌లో 410వ ర్యాంకు

tribal girl sreedhanya suresh scores 410 rank in 2019 civils

?????????????????????????????????????
కృషి, నిరంతరం పట్టుదల ఉంటే సాధించనిది అంటు ఏమీ లేదు అని నిరూపించింది ఓ గిరిజన అమ్మాయి.

కేరళకు చెందిన శ్రీధన్య సురేశ్(22) నిన్న వెలువడిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2018 ఫలితాల్లో 410 ర్యాంకు సాధించింది.

అత్యంత వెనుకబడిన ప్రాంతం వయనాడ్ నుంచి తొలిసారిగా సివిల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అమ్మాయిగా శ్రీధన్య చరిత్ర సృష్టించింది.

ఈ సందర్భంగా ఆమెకు కేరళ సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

కేరళ నుంచి ఒక గిరిజన అమ్మాయి తొలిసారిగా సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.

ఈ సందర్భంగా ఆమెకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని రాహుల్ ట్వీట్ చేశారు.

శ్రీధన్యకు ఉన్న పట్టుదల, చిత్తశుద్ధి వల్లే ఆమె కల సాకారమైందన్నారు.

ఈ సందర్భంగా శ్రీధన్య మాట్లాడుతూ.. కేరళలో అత్యంత వెనుకబడ్డ జిల్లా నాది. అక్కడ ఎవరూ గిరిజన కులానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. నాకు ఇప్పుడు సివిల్స్ రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్ తరాలు నన్ను ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నానని శ్రీధన్య తెలిపారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర సర్వీసుల్లో నియామకం కోసం 759 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని యూపీఎస్‌సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.

వీరిలో 577 మంది పురుషులు కాగా, 182 మంది మహిళలున్నారు.