Editorials

హతవిథీ! ఏమిటిది?

Republicans Lose Kentucky And Virgnia Gubernatorial Elections

అమెరికాలోని కెంటకీ, వర్జీనియా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి ఈ ఫలితాలు పెద్ద దెబ్బ అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుత కెంటకీ రాష్ట్ర గవర్నర్‌ (రిపబ్లిక్‌ పార్టీ) మ్యాట్‌ బెవిన్‌ డెమోక్రాటిక్‌ అభ్యర్థి ఆండీ బెషియర్‌ చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలోని ఉభయ సభల్లోనూ డెమోక్రాట్లకే ఆధిక్యం లభించింది.