‘గల్లీలో మనమే ఉండాలి.. దిల్లీలో మనమే ఉండాలి’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అధికారం మొత్తం దిల్లీలోనే కాకుండా వికేంద్రీకరణ జరిగేలా తెరాస విజయం ఉండాలన్నారు. రాష్ట్ర్రాలకు విశేష అధికారాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్ర్రానికి కావాల్సిన నిధులు సాధించుకోవాలంటే దిల్లీలో తెరాస ఎంపీలే ఉండాలన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కులాలు, మతాల పేరిట ఓట్లు అడుగుతూ 71 ఏళ్లు జాతికి మోసం చేసిన రెండు జాతీయ పార్టీలకు సరైన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్, భాజపాలను ఉద్దేశించి అన్నారు. హైదరాబాద్ నగరంలో చిన్నపాటి సమస్యలున్నాయని, రానున్న ఐదేళ్లలో వాటిని సమూలంగా పరిష్కరించి ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకుంటామని చెప్పారు.
జీత్నా జరూరీ హై
Related tags :