Devotional

నేడు కార్తీక శుద్ధ ఏకాదశి-ప్రాముఖ్యత

Karthika Suddha Ekadashi And Its Importance

కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధైకాదశి’,‘బృందావన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్థాన ఏకాదశి అయ్యింది. దీనినే హరి-భోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహభారత యుద్ధంలో బీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి జాగరన చేయాలి. మర్నాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణుపూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్మ్యం గురించి బ్రహ్మదేవుడు, నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కందపురాణంలో కనిపిస్తుంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పు రవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు, తన వేలజన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న పుణ్యకార్యం చేసినా, అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసినవారికి సాధించలేనివి ఏమి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానంతో పాటు పాపాపరిహారం జరుగుతుంది… పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసినవారికి లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షితో అన్నారు. ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానది తీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం. వస్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే గాక మరణానంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్దులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడలిలోని శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి విష్ణుమూర్తికి హరతి ఇవ్వాలి.. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్లి అక్కడ స్వామికి ఇచ్చె హారతిని కన్నులారా చూసినా, హారతి కర్పూరం సమర్పించినా అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది.
1.ప్రత్యేక దర్శనం కోటా పెంపు: తితిదే
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ఈ నెలలో 4 రోజుల పాటు ప్రత్యేక ప్రవేశదర్శనం కోటా పెంచుతున్నట్లు తితిదే ప్రకటించింది. 12, 26 తేదీల్లో 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు 4వేల టోకెన్లను జారీ చేస్తుంది. టోకెన్లను తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదుట ఉన్న కౌంటర్లో అందిస్తుంది.
2.చినతిరుపతి శ్రీవారి ఆదాయం రూ.2.57 కోట్లు
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల(చినతిరుపతి) వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 37 రోజులకు గాను రూ.2,57,19,805 సమకూరింది. నగదుతో పాటు 877 గ్రాముల బంగారం, 8.055 కిలోల వెండి లభించినట్లు ఈవో దంతులూరి పెద్దిరాజు తెలిపారు. పాత నోట్ల రూపంలో రూ.83,500 నగదు, విదేశీ కరెన్సీ సమకూరినట్లు ఈవో వివరించారు.
3. నవంబర్ 08 శుక్రవారం 2019..మీ రాశిఫలాలు
మేషం
ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మంచి ఆహారం, మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అయితే గర్వానికి, అహంకారానికి తావివ్వకండి. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బందిపడే అవకాశముంటుంది. పుకార్లను. చెప్పుడు మాటలను పట్టించుకోకండి. పెట్టుబడులకు అనుకూల దినం.
వృషభం
ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది.
మిథునం
ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో కొంత జాగ్రత్త అవసరం. తొందరపడి పెట్టే పెట్టుబడుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. అలాగే మీ శత్రువుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వారి కారణంగా మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
కర్కాటకం
ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేతులు, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాసముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం కానీ, ఏదైనా అడ్డంకి ఎదురవడం కానీ జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
సింహం
ఈ రోజు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్కు అనుకూల దినం.
కన్య
ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహ సంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. మీ తల్లిగారి తరఫు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
తుల
ఈరోజు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణం కానీ, ఉద్యోగంలో మార్పుకానీ ఉం టుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం చేసుకోవటం కానీ, ఆధ్యాత్మిక క్షేత్రాల్ని సందర్శించడం కానీ చేస్తారు.
వృశ్చికం
ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.
ధనుస్సు
ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, బదిలీ కొరకు ఎదురు చూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను, బంధువులను కలుస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు.
మకరం
ఈ రోజు మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది.
కుంభం
ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
మీనం
ఈ రోజు కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా కొంత అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఖర్చుల విషయంలో ఆచి, తూచి అడుగేయండి. గొప్పలకు పోయి డబ్బులు ఎక్కువగా ఖర్చు చేసుకోకండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం.
4. పంచాం 08.11.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: శుక్ల
తిథి: ఏకాదశి ప.12:04 వరకు
తదుపరి ద్వాదశి
వారం: శుక్రవారం (భృగు వాసరే)
నక్షత్రం: పూర్వాభద్ర 12:54 వరకు
తదుపరి త్తరాభద్ర
యోగం: వ్యాఘత, హర్షణ
కరణం: విష్టి
వర్జ్యం: రా.11:30 – 01:16
దుర్ముహూర్తం: 08:34 – 09:19
మరి 12:22 – 01:08
రాహు కాలం: 10:34 – 11:59
గుళిక కాలం: 07:42 – 09:08
యమ గండం: 02:50 – 04:16
అభిజిత్ : 11:37 – 12:21
సూర్యోదయం: 06:17
సూర్యాస్తమయం: 05:42
వైదిక సూర్యోదయం: 06:20
వైదిక సూర్యాస్తమయం: 05:38
చంద్రోదయం: ప.03:17
చంద్రాస్తమయం: రా.02:40
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: మీనం
దిశ శూల: పశ్చిమం
నక్షత్ర శూల: దక్షిణం
చంద్ర నివాసం: ఉత్తరం
దేవఉత్థాన ఏకాదశి
భీష్మ పంచక
హరి- భోధనైకాదశి
బృందావన ఏకాదశి
అంబరీషోపఖ్యాన పారాయణ
సతీసక్కుబాయి పుణ్యతిథి
ఆమలక నారాయణ పూజ
5. తిరుమల అప్ డేట్
తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీ వారి దర్శనానికి 16 కంపాక్ట్ మెంట్ లలో వేచిఉన్న భక్తులు.శ్రీ వారి ధర్మదర్శనానికి 10 సమయం.కాలిబాట దర్శనానికి 6 గంటలు.. 300 రు,, ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయంనిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 65,693శ్రీ వారి హుండీ నుండి నిన్న ఒక్కరోజు ఆదాయం 3.12 కోట్లువివరాలకు www.edukondalu.com ను తిలకించండి.
6. కిరాతార్జునీయం*
పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయమది. తమ వద్దకు వచ్చిన వ్యాసమునీంద్రుని పాండవులు అర్ఘ్య పాద్యాదులతో పూజించిన తరువాత ఆయనతో ‘కౌరవులు మమ్మల్ని మాయ జూదంలో ఓడించారు. మమ్మల్ని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికీ పంపించారు. శత్రుంజయులుగా పేరొందిన మాకే ఇప్పుడు శత్రుభయం పట్టుకుంది. మాకు తగిన తరుణోపాయం చెప్పండి’’ అని అడిగారు.అపుడు వ్యాసభగవానుడు ‘‘మీకు ఎంతమంది శత్రువులున్నా వారిని గెలవాలంటే శివానుగ్రహం కలగాలి. కాబట్టి అర్జునుని శంకరుని గురించి తపస్సు చేయమనండి. శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రం అడగండి. శంకరుడు దానిని మీకు ఇచ్చి విజయీభవ అని ఆశీర్వదిస్తే ఇక మీ విజయానికి తిరుగులేదు’’ అని చెప్పి వ్యాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.వ్యాసుడి సూచన మేరకు అర్జునుడు శివారాధన చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలం తర్వాత శంకరుడు అర్జునుడి శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఒక అడవిపందిని సృష్టించి దానిని అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు పంపాడు. అది అక్కడికి వెళ్లి రొద చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరిచి చూశాడు అర్జునుడు. వెంటనే తన విల్లందుకున్నాడు. ఈలోగా శివుడు అర్జునుడి వెనుక నుంచి అడవిపంది మీదకి వేసిన బాణం దాని పృష్ట భాగంలోంచి శరీరంలోకి వెళ్లి దాని నోట్లోంచి బయటకు వచ్చి నేలమీద పడింది. సరిగ్గా అదే సమయంలో ఎక్కుపెట్టిన అర్జునుడి బాణం అడవి పంది నోట్లోంచి శరీరంలోకి వెళ్లి అక్కడనుంచి పృష్ఠభాగంలోంచి బయటకు వెళ్లి నేలమీద పడింది. శివుడు తన ప్రమథగణాలలో ఒకడిని పిలిచి తన బాణాన్ని తీసుకు రమ్మనమని చెప్పాడు. అతను వెళ్లి అర్జునునితో ‘ఈ బాణం మా నాయకుడిది. ఆయన గొప్ప వీరుడు. ఆయన బాణం తీశాడంటే ఎవరూ నిలబడలేరు. జాగ్రత్త’’ అన్నాడు కవ్వింపుగా.. ‘‘మీ నాయకుడు అంత మొనగాడయితే నాతో యుద్ధానికి రమ్మని చెప్పు’’ అన్నాడు అర్జునుడు. ఆ మాటకోసమే ఎదురు చూస్తున్నాడు కిరాతుడి రూపంలో ఉన్న శివుడు. కొండమీది నుంచి ఒక్క దూకు దూకి అర్జునుడి ముందు నిలబడి, ‘‘ఈ పందిని నువ్వు నీ బాణంతో కొట్టావా? ఏదీ ఇప్పుడు చూపు నీ విద్య’’ అన్నాడు. అర్జునుడు క్షణం ఆలస్యం చేయకుండా శివుని మీద బాణాలు ప్రయోగించడం ప్రారంభించాడు. శివుడు కూడా అర్జునుని మీదకు బాణాలు వేస్తున్నాడు. అర్జునుడు తన బలం అంతటినీ ఉపయోగించి శివుడిని పడగొట్టేందుకు యత్నిస్తున్నాడు. కానీ శివునికి ఏమీ అవడం లేదు. తర్వాత ఇద్దరూ మల్లయుద్ధం చేశారు. శంకరుడు అర్జునుని శరీరాన్ని తోసి అవతల పారేశాడు. అపుడు అర్జునుడు తిరిగి లేచి తన ధనుస్సుతో శంకరుని జటాజూటం మీద ఒక గట్టి ప్రహారం చేశాడు. అపుడు శంకరుడు ఇక యుద్ధాన్ని చాలించి చంద్రవంకతో, పట్టుపుట్టంతో, పార్వతీ సమేతంగా అర్జునుడికి ఎదురుగుండా నిలబడ్డాడు.మళ్ళీ కొడదామని గాండీవాన్ని ఎత్తిన అర్జునుడు తన ఎదుట సాక్షాత్కరించిన అర్ధనారీశ్వరుడి పాదాల మీద పడి శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి కన్నుల వెంట నీరు కార్చుతూ ‘‘ఈశ్వరా, జగత్తుకే తండ్రివయిన నీపై అజ్ఞానినై బాణాలు వేశాను. నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది’’ అని పరమేశ్వరుని పాదాల మీద పడిపోయాడు. అపుడు శంకరుడు ‘‘నీకు పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను. మీకు ఎదురులేదు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరే గెలిచి తీరుతారు. విజయీభవ!’’అని ఆశీర్వదించాడు.ఇందులో మనం గ్రహించవలసిన నీతి ఏమిటంటే… ఆపదలో ఉన్న సమయంలో తగిన ఉపాయం చూపిన వాడే మనకు హితుడనీ, భగవంతుడు తన భక్తులకు అనేక పరీక్షలు పెట్టి, వాటిలో నెగ్గినప్పుడే వరాలను అనుగ్రహిస్తాడనీ, అంతవరకూ మనం కుంగిపోకుండా కాలం పెట్టిన పరీక్షలలో నిగ్గు తేలాలి.
7. తిరుమల \|/ సమాచారం* *
_*!!ఓం నమో వేంకటేశాయ!!*_
● ఈరోజు శుక్రవారం *08-11-2019* ఉదయం *5* గంటల సమయానికి.
● తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం…
● శ్రీవారి దర్శనానికి *16* కంపార్ట్ మెంటులలో వేచి ఉన్న భక్తులు…….
● శ్రీవారి సర్వ దర్శనానికి *10* గంటల సమయం పడుతోంది…..
● ప్రత్యేక ప్రవేశ దర్శనానికి( ₹300 ) *3* గంటల సమయం పడుతోంది….
● కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు *3* గంటల సమయం పడుతోంది…..
● నిన్న నవంబర్ *7* న *65,693* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…
● నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *₹ 3.12* కోట్లు…
_*గమనిక:*_
# ₹:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,_వయోవృద్దులు / దివ్యాంగుల_• ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,I_చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమస్తారు,*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!_*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికముల చేయవలసియున్నది__కావున లెమ్ము స్వామి_ *ttd Toll free #18004254141*తిరుమల,తిరుపతి భక్తి సమాచార సమాహారంమరిన్ని విశేషాలకుhttp://www.edukondalu.com/
8. చరిత్రలో ఈ రోజు/నవంబర్ 8*ల్ కృష్ణ అద్వానీ
1627 : మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం.
1656 : ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం.
1884 : ప్రముఖ మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922)
1893 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు జననం.
1927 : భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం.
1947 : ప్రసిద్ధ భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం.
1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం.
2013 : తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957)
9. ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన భవాని మాలదారణలు.. అమ్మవారికి పగడాలమాలదారణ చేసి ప్రత్యేకపూజలు నిర్వహించి భవానీ దీక్షలను ప్రారంభించిన ఆలయ ప్రధాన అర్చకులు.. మహామండపంలోని ఆరవ అంతస్తులో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈవో దంపతులు.. ఆరవ అంతస్తులో భవాని మాలదారణకు ఏర్పాట్లు.. ఇంద్రకిలాద్రికి భారీగా చేరుకుంటున్న భవానీభక్తులు…
10.తిరుమలలో ఏపీ టూరిజం రెస్టారెంట్
శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చె వృద్దులు, దివ్యంగులు చంటి పిల్లలు తల్లిదండ్రులు ఈనెలలో నలుగు రోజుల పాటు ప్రత్యెక ప్రవేశ దర్శనం కోటా పెంచుతున్నట్లు తితిదే ప్రకటించింది.
11. పుష్కరిణి వ్యథ వర్ణనాతీతం..!
నాచుపట్టి దుర్గంధభరితంగా మారిన ఈ కొలను.. తిరుపతిలోని గోవిందరాజులస్వామి ఆలయంలోని పుష్కరిణి. స్వామి దర్శనానికి వెళ్లే ముందు స్నానం చేయడానికి, నీళ్లు తలపై చల్లుకోవడానికి వస్తున్న భక్తజనం..పుష్కరిణి ప్రస్తుత పరిస్థితిని చూసి బాధతో వెనుదిరుగుతున్నారు. నిర్వహణ సరిగాలేక పుష్కరిణి మురికి కూపాన్ని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
12. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి లక్ష పుష్పార్చన వీడియో…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన లక్ష పుష్పార్చన లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్తీక మాసం కావడంతో భక్తులు యాదాద్రికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామి ధర్మదర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు.