ప్రస్తుతం పెరుగును చిలకడం మానేశారు. మజ్జిగ కాకుండా పెరుగే అన్నంలో వేసుకు నితింటున్నారు. కానీ ఒకప్పుడు పెరుగు బదులు మజ్జిగన్నం తినేవాళ్లు. పొద్దున్నే టిఫిన్ తినేవాళ్లు కాదు. రాత్రి మిగిలిన అన్నంలో పొద్దున్నే పెరుగు వేసుకు ని చద్దన్నం తినేవాళ్లు. ఇలా తినడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. కడుపులో ఆమ్లాలు చల్లబడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అమీబియాసిస్, మొలలు, మలబద్ధకం, పేగుల్లో పూత లాంటివి రావు. కొందరైతే రాత్రి అన్నంలో తోడువేసిన పాలు పోసి కలిపి పెడతారు. తెల్లవారే సరికి గట్టిగా అన్నంతో కలిసిపోయి పేరుకుంటుంది. దాన్లో కొద్ది గా నీళ్లు, ఉల్లి ముక్కలు, టొమాటో ముక్కలు వేసుకుని తింటారు. మరికొందరు ఉదయాన్నే వండిన వేడి అన్నంలో పెరుగు వేసుకుని తింటారు. వేసవి కాలంలో పొద్దున్నే ఈ అన్నం తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుం ది.బయటికి వెళ్లినా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. చద్దన్నాన్ని అలాగే తినలేని వాళ్లు, తాలింపువేసుకు ని తినొచ్చు. పూరి, దోశె, బోండా లాంటి టిఫిన్ల కంటే వేసవిలో చద్దన్నం చాలా మంచిది.
వేసవిలో చలువ చేస్తుంది. చద్దన్నం తినండి.
Related tags :