Movies

₹3.5కోట్లు

Anushka Remmuneration Sky Rocketing

తెలుగులో అద్భుతమైన ఇమేజ్‌ను అందుకున్న టాప్ హీరోయిన్‌గా మన్ననలు అందుకుంటున్న అనుష్క ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా చిత్రాలను వదులుతోంది. ప్రస్తుతం కథానాయిక ప్రాధాన్యత వున్న సినిమాలవైపు ఆమె పూర్తి దృష్టి పెట్టినట్లుగా వుంది. అంతలా అటువంటి పాత్రలో ఇమిడిపోయి ఓవైపు నటన, మరోవైపు గ్లామర్ పండిస్తోంది అనుష్క. బాక్సాఫీస్ వద్ద అనుష్క సినిమాలకు మంచి మార్కెట్టే వుంది. అందుకు తగ్గట్టుగా తన పారితోషికాన్ని కూడా భారీగా తీసుకుంటోందని టాలీవుడ్ సమాచారం. ఒక్క సినిమా కోసమే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అందుకుంటోంది ఈ భామ. దక్షిణాదిలో నయనతార తర్వాత అంత పెద్ద మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న నటి అనుష్క మాత్రమే. నయనతార కూడా ఒక్కొక్క సినిమాకు దాదాపు 6 కోట్లవరకూ డిమాండ్ చేస్తోంది. అయితే ఇదంతా కరెక్టు కాదని మరో వాదన కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన నిశ్శబ్దం చిత్రం ప్రేక్షకులను మురిపించనుంది. ఈ చిత్రంలో మాటలు రాని హీరోయిన్‌గా ఆమె నటన అద్భుతంగా వుందని ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఏదేమైనా పారితోషికం విషయంలో నయనతార తర్వాత నేనేనంటోంది స్వీటీ అనుష్క.