1. శబరిమల దర్శనానికి పేర్లను నమోదు చేసిన మహిళలు – ఆద్యాత్మిక వార్తలు -11/14
శబరిమల ఆలయ దర్శనానికి మహిళలకు అనుమతినిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆలయ కమిటీ స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. ఇప్పటి వరకు స్వామి వారిని దర్శించుకోవడం కోసం 36 మంది మహిళలు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడడానికి కొద్ది సమయం ముందే ఈ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..గతేడాది సెప్టెంబర్ 28న ఆలయం లోపలికి మహిళల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు వెలువడిన విషయం తెలిసిందే. గతంలో 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించడం నిషేధం. కోర్టు తీర్పునిచ్చిన తరువాత ఈ ఏడాది జనవరి 2న ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేశారు. గతేడాది కూడా నిషేధిత వయస్సు కల 740 మంది మహిళలు ఆలయ ప్రవేశం కల్పించలంటూ ఆన్‌లైన్ నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారి వివరాలను పోలీసులు సేకరించిన తరువాత వారి ఇళ్లకు వెళ్లి వారు తీర్థయాత్రకు రావడం లేదని స్పష్టం చేసుకున్నారు.
ఇప్పుడు నమోదు చేసుకున్న 36 మంది మహిళల వివరాలను పోలీసులు సేకరించారని సమాచారం. తాజాగా వెలువడ్డ సుప్రీం తీర్పు గురించి ప్రస్తావించడానికి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నిరాకరించారు. దేవాదాయ రాష్ట్ర మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందన్నారు.
2. శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు త్వరలో ట్రస్టుబోర్డులు
శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు త్వరలో పాలకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 21 కోట్ల పైబడి వార్షిక ఆదాయం కలిగిన ఎనిమిది దేవాలయాలకు ట్రస్టుబోర్డు సభ్యులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోగా వాటిలో జిల్లాకు చెందిన ఈ ఆలయాలు రెండూ వున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకూ శ్రీకాళహస్తి ఆలయానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు కాలేదు. కాణిపాక ఆలయానికి మాత్రం పాలకమండలి ఏర్పాటైనప్పటికీ ఇటీవలే దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆలయాల పాలకమండళ్ళతో సహా నామినేటెడ్ పోస్టుల భర్తీలో యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాలని, అదే సమయంలో అన్ని పోస్టుల్లో యాభై శాతం మహిళలతో భర్తీ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగంగా అప్పటికే నియామకం జరిగిన కాణిపాకం సహా జిల్లాలోని పలు ఆలయ కమిటీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇపుడు శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల ట్రస్టుబోర్డులకు సభ్యులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో త్వరలోనే ఈ పాలకమండళ్ళు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.
3. పంచాంగం 14.11.2019
సంవత్సరం: వికారి
ఆయనం: దక్షిణాయణం
ఋతువు: శరద్
మాసం: కార్తిక
పక్షం: కృష్ణ
తిథి: విదియ రా.07:48 వరకు
తదుపరి తదియ
వారం: గురువారం (బృహస్పతి వాసరే)
నక్షత్రం: రోహిణి రా.11:42 వరకు
తదుపరి మృగశిర
యోగం: పరిఘ, శివ
కరణం: తైతిల
వర్జ్యం: ప.03:24 – 05:03 వరకు
మరియు రా.తె.05:21 – 06:58
దుర్ముహూర్తం: 10:06 – 10:52
మరియు 02:39 – 03:24
రాహు కాలం: 01:25 – 02:50
గుళిక కాలం: 09:10 – 10:35
యమ గండం: 06:20 – 07:45
అభిజిత్ : 11:38 – 12:22
సూర్యోదయం: 06:20
సూర్యాస్తమయం: 05:40
వైదిక సూర్యోదయం: 06:23
వైదిక సూర్యాస్తమయం: 05:36
చంద్రోదయం: రా.07:14
చంద్రాస్తమయం: ఉ.07:41
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృషభం
దిశ శూల: దక్షిణం
నక్షత్ర శూల: పశ్చిమం
చంద్ర నివాసం: దక్షిణం
రోహిణి వ్రతమ్
అశూన్యశయన వ్రతమ్
చాతుర్మాస్య ద్వితీయ
4. రాశిఫలం – 14/11/2019
తిథి:
బ.విదియ రా. 7.11, కలియుగం-5121 తీశాలివాహన శకం-1941
నక్షత్రం:
రోహిణి 11.00
వర్జ్యం:
మ. 2.29 నుంచి 4.29 వరకు, తిరిగి రా. 4.39 నుంచి 6.16 వరకు
దుర్ముహూర్తం:
ఉ. 10.00 నుంచి 10.48 వరకు, తిరిగి మ. 02.48 నుంచి 3.36 వరకు
రాహు కాలం:
మ.1.30 నుంచి 3.00 వరకు
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్యముంటుంది. బంధుమిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త పడాలి. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది, చేసేపనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తుఆభరణాలను పొందుతారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలను పొందుతారు. ప్రయాణాలల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొందుతారు. ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు. ధనలాభయోగముంది. శుభవార్తలు వింటారు. శుభకార్యప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఋణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం చేయకూడదు. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కలతలేర్పడవచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగాలి. అనారోగ్య బాధలుంటాయి.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. వాయిదా వేసుకొన్న కార్యాలు ఈ రోజు పూర్తి చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. వ్యవసాయ మూలక లాభాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలను ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు లభ్యమవుతాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబంలో ఆనందోత్సవాలు లభిస్తాయి. బంధుమిత్రులు కలుస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ధనలాభముంటుంది. రాజకీయరంగంలోనికి వారిని అద్భుతమైన అవకాశాలుంటాయి. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. వారి ద్వారా కొన్ని లాభాలు ఏర్పడుతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగరంగాల్లోని వారికి అభివృద్ధి కలుగుతుంది.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతోసతమతమవుతాయి. పోట్లాటలకు దూరంగా ఉండాలి. అనారోగ్య బాధలు అధిగమించడానికి ఔషధ సేవ తప్పనిసరి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు కూడదు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మానసికానందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిసస్తుంది. కొన్నిపనులు మాత్రము అనుకొన్నట్టు పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
5. చరిత్రలో ఈ రోజు
నవంబర్, 14 సంఘటనలు
1943: హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.
1960: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
జననాలు
1716 : గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (జ.1646)
1889: జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ ప్రధానమంత్రి (మ.1964)
1891 : కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం (మ.1941).
1922: ఐక్యరాజ్య సమితి కి 6 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జననం.
1924: కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత మరియు తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000)
1931: వంకాయల నరసింహం, ప్రముఖ సంగీత విద్వాంసుడు, ప్రథమశ్రేణి మృదంగ నిపుణులు.
1939: ఆర్. విద్యాసాగర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారు. (మ.2017)
1947: దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు.
1948 : వేల్స్ యువరాజు చార్లెస్ జననం.
1948: యండమూరి వీరేంధ్రనాథ్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
1948: మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత,
1971: ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ అంతర్జాతీయ క్రికెటర్.
1976: హేమంగ్ బదాని, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
1978: తవ్వా ఓబుల్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన తెలుగు రచయిత.
1991: సమీరా షెరీఫ్ భారతీయ టెలివిజన్ నటి మరియు నిర్మాత.
మరణాలు
1958: తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.
1967: సి.కె.నాయుడు, ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895)
1977: ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద, ప్రముఖ అధ్యాత్మిక గురువు.
1995: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు
పండుగలు మరియు జాతీయ దినాలు
– భారతదేశంలో బాలల దినోత్సవం.
ప్రపంచ మధుమేహ దినోత్సవం.
జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, – జాతీయ పుస్తక వారోత్సవాలు,
సహకార సంఘాల వారోత్సవాలు.
6. తిరుమల \|/ సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు గురువారం,
14.11.2019
ఉదయం 6 గంటల
సమయానికి,
తిరుమల: 19C°-24℃°
• నిన్న 59,438 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో 04
గదిలో భక్తులు వేచి
ఉన్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
04 గంటలు
పట్టవచ్చును,
• నిన్న 20,876 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.70 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
గమనిక:
# ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
#ఈనెల 26న వృద్ధులు /
దివ్యాంగులకు ప్రత్యేక
ఉచిత దర్శనం,
(భక్తులు రద్దీ సమయాల్లో
ఇబ్బంది పడకుండా ఈ
అవకాశం సద్వినియోగం
చేసుకోగలరు)
#ఈనెల 27 న చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(ఉ: 9 నుండి మ:1.30
వరకు సుపథం మార్గం
ద్వారా దర్శనానికి
అనుమతిస్తారు,
వయోవృద్దులు/ దివ్యాంగుల
• ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్
వద్ద వృద్దులు (65 సం!!)
మరియు దివ్యాంగులకు
ప్రతిరోజు 1400 టోకెన్లు
జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,
ఉ: 10 కి మరియు
మ: 2 గంటలకి దర్శనానికి
అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా
శ్రీవారి దర్శనానికి
అనుమతిస్తారు, ఉ:11
నుండి సా: 5 గంటల
వరకు దర్శనానికి
అనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి ttd Toll free #18004254141