Politics

జగన్ కేసీఆర్ మధ్య విభేదాలు-తెలంగాణపై సుప్రీంలో ఏపీ దావా

Difference Of Opinions Between Jagan & KCR-AP Complains On TG In SC-జగన్ కేసీఆర్ మధ్య విభేదాలు-తెలంగాణపై సుప్రీంలో ఏపీ దావా

ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నాటి హామీలు ఏమయ్యాయి. ఎ సమస్య అయినా తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం చర్చలతోనే పరిష్కరించుకుంటామన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పలు దఫాలు భేటీలు నిర్వహించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన అభ్యంతరాలతో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. పోలవరం పైన తమకు అభ్యంతరం దాఖలు చేసింది. పోలవరం పైన తమకు అభ్యంతరం లేదని.. కేసు ఉప సంహరించుకోవాలని కేసీఆర్ చెప్పారు. ప్రత్యెక హోదా ఎపీకి ఇవ్వాలని అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తామన్నారు. ఏదీ జరగలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని రెండు రాష్ట్రాలలోని ప్రాంతాలను కలుపుతూ శ్రీశైలం వరకు తీసుకెళ్ళే ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్దం చేసారు. కానీ ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వమా సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తో అసలు ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్ది కాలం క్రితం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఈ అంశం మీద రాజకేయంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే ప్రాజెక్టు పైన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని రైతుల ప్రయోజనాలకు విరుద్దంగా విచక్షణా రాహిటంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని పరిసీలించోద్దని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వ అఫిడవిట్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది.