Food

ఈ ఆహారం రక్తపోటును నియంత్రిస్తుంది

foods that relieve hypertension symptoms

రక్తపోటు ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పక తీసుకుంటే దీర్ఘకాలంలో సమస్య తగ్గడంతోబాటు దాని కారణంగా హృద్రోగాలూ పక్షవాతం, మూత్రపిండ వ్యాధులూ రాకుండా ఉంటాయి.
* భోజనానంతరం బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలను స్నాక్స్‌లా తింటే అందులో ఉండే ఆంథోసైనిన్లవల్ల బీపీ తగ్గే అవకాశం ఉంది.
* అరటిపండ్లలోని పొటాషియం ఎంతో మేలుచేస్తుంది. చిలగడదుంపలు, కొబ్బరినీళ్లు, పుట్టగొడుగులు, కర్బూజాల్లో కూడా పొటాషియం లభ్యమవుతుంది.
* బీపీ రోగులకి బీట్‌రూట్‌ మంచి మందు. రోజూ పావులీటరు బీట్‌రూట్‌ రసం తాగితే నాలుగు వారాలకే బీపీ అదుపులో ఉంటుంది.
* పుచ్చలోని సిట్రులీన్‌ అనే అమైనోఆమ్లం నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా రక్తప్రసరణ వేగాన్ని పెంచి బీపీని తగ్గిస్తుంది.
* బీపీ రోగులు భోజనంలో భాగంగా ఏదో ఒకపూట ఓట్స్‌ తీసుకున్నా మంచిదే. అందులో పీచు రూపంలో ఉండే బీటాగ్లూకాన్‌ రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతంతోబాటు బీపీనీ తగ్గిస్తుందట
* నైట్రేట్లు అధికశాతంలో ఉండే పాలకూర, క్యాబేజీ, మెంతికూర, ఆవకూర… కూడా బీపీరోగులకి ఎంతో మేలు చేస్తాయి.
* సహజ యాంటీబయోటిక్‌ అయిన వెల్లుల్లి నైట్రిక్‌ ఆక్సైడ్‌ను పెంచడం ద్వారా బీపీని అదుపులో ఉంచుతుంది. కాబట్టి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా ఫలితం ఉంటుంది.
* యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మరసాన్ని రోజూ ఓ కప్పు తాగినా మేలే. పిస్తా, బాదం కూడా బీపీరోగులకి మంచి ఆహారం. సో, వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉప్పు, కెఫీన్‌… వంటి వాటిని తగ్గిస్తే బీపీని నియంత్రించడం పెద్ద కష్టమేం కాదు.