డచెస్ ఆఫ్ సస్సెక్స్, బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హారీ అర్ధాంగి అయిన మేఘన్ మార్కెల్ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ యువరాణికి బ్రిటన్ పౌరసత్వమే ఇంకా లభించలేదు! దరఖాస్తు చేసి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆమె ప్రతిపాదన ఇంకా అధికారికంగా అంగీకరించలేదు. అంటే ఆమె బ్రిటన్ యువరాణి అయింది కానీ, బ్రిటిష్ పౌరురాలు కాలేదు. యువరాజు హారీతో ఆమె వివాహం జరిగి పద్దెనిమిది నెలలు కావస్తోంది.‘‘(బ్రిటన్) మహారాణి మనుమడు ప్రిన్స్ హారీని పెళ్లి చేసుకుని 18 నెలలు కావస్తున్నా ఆమెకు ఇంకా పౌరసత్వం లభించలేదు. కొంత అసాధారణంగానే ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ కాస్త ఆలస్యంగానే నడుస్తోందనే అనాలి.’’ అని మేఘన్ స్నేహితురాలు వెల్లడించింది. ఈ ఆలస్యం వల్ల డిసెంబరు 12న జరుగనున్న బ్రిటన్ సాధారణ ఎన్నికల్లో ప్రిన్సెస్ మేఘన్ ఓటు వేయలేరు. బ్రిటన్ రాజ కుటుంబీకులు ఎన్నికలలో ఓటు వేయడానికి అనుమతి ఉన్నా.. వారు ఓటు వేయకపోవడమే సంప్రదాయంగా వస్తోంది.
యువరాణి మేఘన్‌కు కష్టాలు
Related tags :