* మద్యం మత్తులో అపస్మారకంగా పడివున్న ఓ యువతిని బంజారాహిల్స్ పోలీసులు కాపాడి, స్టేషన్ కు తీసుకురాగా, మెలుకువ వచ్చిన తరువాత ఆమె హల్‌చల్ చేసింది. నిన్న రాత్రి లీసా అనే యువతి రోడ్డుపై పూటుగా మద్యం సేవించి పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు, ఆమెను స్టేషన్ కు చేర్చారు. ఆ యువతి పోలీస్ స్టేషన్ నుండి పారిపోయేందుకు ప్రయత్నించగా, మహిళా పోలీసులు అడ్డుకున్నారు.
* విశాఖపట్టణం నగరంలో ఓ కారు డ్రైవర్ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు మహిళలు, అమ్మాయిలను మోసం చేసినట్టు వెల్లడైంది. ముఖ్యంగా, లావుగా ఉన్న మహిళలు, యువతులను టార్గెట్ చేసి, వారివద్ద లక్షలాది రూపాయలు గుంజుకున్నట్టు తేలింది.
* నంద్యాల ఎన్జీవోస్ కాలనీ లో చంద్రశేఖర్ రెడ్డి అనే కేబుల్ ఆపరేటర్ పై కత్తితో దాడి. కేబుల్ కనెక్షన్ వ్యాలిడిటీ అయిపోయింది రీచార్జ్ చేసుకోమని చెప్పినందుకు చంద్రశేఖర్ రెడ్డి పై దుర్భాషలాడుతూ కత్తితో దాడికి పాల్పడిన దుండగులు. బీట్ కానిస్టేబుల్ చూస్తుండగానే కత్తితో దాడి చేయడం దారుణమని ఆవేదన చెందిన బాధితుడు చంద్రశేఖర్ రెడ్డి.
* రెచ్చిపోయిన దుర్గి ఎస్ఐ ఎం రామాంజనేయులు. మహిళ అని చూడకుండా కూడా చితకబాదిన ఎస్సై. ధర్మవరం గ్రామములో ఉద్రిక్తత జనసేన పార్టీకి చెందిన నాయుడు సామాజికవర్గం గ్రామములో కొనిదల కొదమ సింహాలు సాంఘిక నాటక ప్రదర్శన లో జనసేన పార్టీ పాట ప్రదర్శన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
* అమలాపురం లో ఉద్రిక్తత, అమలాపురం ల్యాండ్ మార్క్ కలశంను కూల్చివేసేందుకు ప్రయత్నించిన అధికారులు.అడ్డుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు.కూల్చివేసేందుకు అనుమతులు చూపమనడంతో వెనుదిరిగిన అధికారులు.
* బాసర రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. కదులుతున్న ట్రైన్ నుంచి ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూకేశారు. ఈ ఘటనలో ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఎన్పీటీఈఎల్ (NPTEL) పరీక్ష కోసం నిజామాబాద్ వెళ్లేందుకు బాసర ట్రిపుల్ ఐటీ నుంచి 106మంది విద్యార్థులు బయల్దేరారు. అయితే వీరిలో ముగ్గురు అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కబోయి.. పొరపాటున పర్భని పాసింజర్ ఎక్కారు. ట్రైన్ రన్నింగ్‌లో ఉండగా… అది తాము ఎక్కాల్సిన రైలు కాదని తెలిసి దూకేశారు. దీంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థికి తలపై బలమైన గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి వరంగల్ జిల్లాకు చెందిన సాయికుమార్‌గా తెలుస్తోంది.
* శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సందర్భంగా హింస చెలరేగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళుతున్న ముస్లిం ఓటర్ల బస్సుల కాన్వాయ్‌పై ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరపడంతోపాటు రాళ్లు కూడా విసిరాడని పోలీసులు వెల్లడించారు.
* తమిళనాడులో పదహారేళ్ల బాలికకు బిడ్డ పుట్టడంతో ఆమె భర్తను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన సంఘటన వేలూరు జిల్లాలో జరిగింది. వివరాలు… సదుప్పేరికి చెందిన భవననిర్మాణ కార్మికుడు కుమరవేలు(21) గత ఏడాది 16 ఏళ్ల బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గర్భం దాల్చిన ఆ బాలిక వేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు జరిపిన విచారణలో ఆమెకు 16 ఏళ్లని తెలియడంతో మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ పునిద విచారణ జరిపి, బాలికను వివాహం చేసుకున్నందుకు గాను కుమరవేలును పోక్సో చట్టంలో అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం అతడిని వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
* రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి చెందిన సంఘటన గుంటూరు-మాచర్ల రహదారి ప్రక్కన బెల్లంకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుఝామున చోటుచేసుకుంది. మృతుడు శ్రవణ్ వరంగల్ కు చెందిన వ్యక్తి కాగా, పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో సిగ్నల్ డిపార్టుమెంటులో ఉద్యోగి అని తెలిసింది. బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.