ScienceAndTech

టిక్‌టాక్…ఆన్ ద టాప్

TikTok App Ranked No 3 On Google Play Store

ప్రముఖ సోషల్ యాప్ టిక్‌టాక్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న నాన్ గేమింగ్ యాప్‌లలో టాప్ 3 స్థానంలో కొనసాగుతోంది.

ఈ యాప్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకోగా ఇండియాలోనే దీన్ని అధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని ఆ కంపెనీ డెవలపర్లు తెలిపారు.

ఈ క్రమంలో మొత్తం 1.5 బిలియన్ల యాప్ డౌన్‌లోడ్స్‌లో 466.8 మిలియన్ల (31 శాతం) యూనిక్ డౌన్‌లోడ్స్ ఇండియా నుంచే వచ్చాయని వారు తెలిపారు.

ఇక ఈ యాప్ ఈ ఏడాదిలోనే ఏకంగా 614 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకోగా గతేడాది కన్నా ఇది 6 శాతం ఎక్కువ కావడం విశేషం.

కాగా టిక్‌టాక్ యాప్‌ను అత్యధిక సంఖ్యలో డౌన్‌లోడ్ చేసుకుంటున్న వారిలో భారత్ తరువాత రెండో స్థానంలో చైనా ఉండడం విశేషం.

అక్కడ ఈ యాప్ 45.5 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకుంది.

ఆ తరువాతి స్థానంలో అమెరికా (37.6 మిలియన్ల డౌన్‌లోడ్స్) ఉంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ అవుతున్న నాన్ గేమింగ్ యాప్‌లలో వాట్సాప్ (707.4 మిలియన్ల డౌన్‌లోడ్స్) అగ్రస్థానంలో ఉంది.

ఆ తరువాతి స్థానాల్లో ఫేస్‌బుక్ మెసెంజర్ (636.2 మిలియన్లు), ఫేస్‌బుక్ (587 మిలియన్లు), ఇన్‌స్టాగ్రామ్ (376.2 మిలియన్లు)లు నిలిచాయి.