DailyDose

భర్తకు గుండెపోటు..భార్య ఆత్మహత్య-నేరవార్తలు-11/19

Wife Commits Suicide For Husband-Telugu Crime News-Nov 19 2019

*భర్తకు గుండెపోటు రావడంతో ఆందోళన చెందిన ఇల్లాలు అతడి కంటే ముందే చనిపోవాలని అనుకుంది. హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో జరిగిందీ ఘటన.
* వాహన తనిఖీలు చేస్తుంటే బైకు ఢీకొట్టిన ఘటనలో ఎస్‌ఐ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని బరిపడా పీఎస్ పరిధిలో జరిగింది. లా కాలేజీ ఎదుట ఎస్‌ఐ దయానిధి దాస్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..రెండు బైకులపై వస్తోన్న యువకులను ఆపాలని సూచించాడు. అయితే ఓ బైకుపై ఉన్న వ్యక్తి తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఎస్‌ఐ దయానిధి దాస్‌ను ఢీకొట్టాడు.
* మగ బిడ్డను కనలేదని తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. భర్త ట్రిపుల్ తలాక్ చెప్పడంతో భార్య పోలీసులను ఆశ్రయించింది.
* తాగిన మైకంలో సొంత తల్లి, చెల్లి మరియు తమ్ముడి భార్యపై అనేకసార్లు అత్యాచారం చేసిన 24 ఏళ్ల వయసున్న వ్యక్తిని అతని కుటుంబ సభ్యులే హతమార్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని డాటియాలో జరిగింది. ఈ హత్యకు సంబంధించి ఆ కుటుంబానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
* జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ అగ్రహారం పరిధిలోని కృష్ణా నదిలో మత్స్యకారులు మొసలి పట్టుకున్నారు. రెండు రోజుల నుంచి మొసలి కనిపిస్తుంది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. మత్స్యకారులు ఎట్టకేలకు మంగళవారం మొసలిని పట్టుకొని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
*చైనాలో విషాదం చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో పదిహేను మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు.
*గత ఎన్నికల ప్రచారంలో వైకాపా ఉపయోగించిన పాటలకు తహసిల్దారు స్టేప్పులేసి ఇరగదీసారు. శ్రీకాకుళం జిల్లా భామినిలో జరిగింది.
*ఓ యువతి తన ప్రియుడితో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆమెను తల్లి చంపేసింది. ఈ ఘటన సౌత్‌ ముంబయిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
*గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కార్యాలయం చోరీకి గురైంది. ఆయన కార్యాలయంలోని రూ.10 లక్షలు విలువ చేసే సొత్తును దోచుకున్నారు. అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
*ఇటీవల తెలంగాణలో కూడా తలాక్ కేసులు ఎక్కువయ్యాయి. తాజాగా ఓ వ్యక్తి తనకు ఆడపిల్ల పుట్టిందని భార్యకు తలాక్ చెప్పిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌కు చెందిన దస్తగిరి అనే వ్యక్తి ఆడపిల్ల పుట్టిందని భార్యకు తలాక్‌ చెప్పాడు. దీంతో అతని భార్య మిరాజ్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
*ఓ యాచకుడు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి వేణుగోపాల స్వామి ఆలయంలో నర్సింహులు(అనే యాచకుడిని రాత్రి పడుకుని ఉండగా తలపై బండరాయితో కొట్టి గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*ఉయ్యూరు మండలం కలవపాముల దగ్గర ఓ కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గౌరీకుమారి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెంది. కారులో ఉన్న మరో నలుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కారు గుడివాడ నుంచి గన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
*మద్యం మత్తులో గుర్రం సాయి అనే ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ సురేశ్‌, హోంగార్డు కుమార్‌పై హత్యాయత్నం చేశాడు. కత్తి పట్టుకొని వెంబడించగా.. భయంతో వారు పరుగులు తీశారు. ఓ అపార్టుమెంట్ ఎదుట దారికి అడ్డంగా నిలిపిన గుర్రం బండిని పక్కకు జరపాలని సెక్యూరిటీగార్డు చెప్పడంతో వివాదం చెలరేగింది. సెక్యూరిటీ, కమ్యూనిటీగార్డులను గుర్రం సాయి గాయపర్చడంతో అక్కడివారు డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొీని బస్సు బోల్తాపడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
*విశాఖ …. గాజువాక ….డక్కన్ ఫ్ర్తెడ్ చికెన్ ( DFC) లో అగ్ని ప్రమాదం..బయటకు పరుగులు తీసిన నిర్వాహకులు ….ఘటన స్ధలానికి చేరుకున్న అగ్మిమాపక ధళం ….పెరుగుతున్న పొగ మంటలు…
*కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో చైన్ స్నాచర్ గా మారిన వార్డు వాలంటర్ ఒక వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆధార్ కార్డు తీసుకురమ్మంటూ చెప్పి ఆమె వెనక్కి తిరగ్గానే మెడలో నల్లపూసల బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యాడు జగ్గయ్యపేటలోని ఆకుల వారి వీధికి చెందిన వార్డు వాలంటర్ ఏ నరేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడుబాధితురాలైన వృద్ధురాలు ఎం వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వార్డు వాలంటీర్ పరారీలో ఉన్నాడు
*కృష్ణా జిల్లాపెనమలూరు నియోజకవర్గ పరిధిలోఉయ్యూరు మండల కలవపాముల గ్రామం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు.
ఈ ప్రమాదంలో గుడివాడకు చెందిన గౌరీ కుమారి 60 సంవత్సరాల మహిళ మృతి.అయిదుగురు కుటుంబ సభ్యులు గన్నవరం నుండి గుడివాడ తిరిగి వెళ్తున్న క్రమంలో కలవపాముల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.
*సియాచిన్ లోని సైనిక శిబిరాలపై హిమపాతం విరుచుకుపడింది. పలువురు సైనికులు మంచుకింద చిక్కుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఎనిమిది మంది సైనికులు మృతి చెందినట్లు చెబుతున్నారు
*విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే రౌడీల్లా మారి కొట్టుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల ఎదుటే బాహాబాహీకి దిగడంతో పాటు ఓ ఉపాధ్యాయుడు ఏకంగా మరో ఉపాధ్యాయుడి కంట్లో కారం కొట్టాడు. 8వ తరగతి విద్యార్థుల మార్కుల జాబితాను అడిగిన మరో ఉపాధ్యాయుడిపై ఇద్దరి మధ్య గొడవ నెలకొంది. ఈ ఘటన చేగుంట మండలం రెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం జరిగింది.
*భర్తకు గుండెపోటు వచ్చిందని ఆందోళనకు గురై.. అతని కంటే ముందు చనిపోవాలని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేట ప్రాంతానికి చెందిన సింధూజ (25) రహమత్నగర్ ప్రాంతంలో నివసించే శివకుమార్ను వివాహం చేసుకొంది
*గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కార్యాలయంలో రూ.10 లక్షల నగదు చోరీ జరిగింది. సంక్షేమ కార్యక్రమాల కోసం నగదు ఉంచినట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయని అర్బన్ సీఐ నరేష్కుమార్ తెలిపారు. కార్యాలయంలో పనిచేసిన వారే అపహరించి ఉంటారని అనుమానిస్తున్నారు. వైకాపా నాయకుడు జూపూడి జాన్సన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
*సియాచిన్లో మంచు కింద సైనికులు చిక్కుకున్న సంఘటన విషాదాంతమైంది. మంచు మీద పడి నలుగురు భారత సైనికులతో పాటు ఇద్దరు సహాయకులు మృతిచెందారు.
*రోడ్డు పక్కన ఆడుకుంటున్న చిన్నారులపై ఓవర్లోడ్ చేసిన ట్రాక్టర్ట్రాలీ పడడంతో ఆరుగురు మృతిచెందిన ఘటన బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
*హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
*కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఈనేపద్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి.