* అసోం ఓరంగ్ జిల్లా గువాబిల్ హైవేపై ప్రమాదం. కారును ఢీకొన్న ట్రక్కు. 8 మంది మృతి. పెళ్ళి వేడుకలో పాల్గొని తిరిగి వెళుతుండగా ప్రమాదం.
* నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్..ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని సురేష్ బాబు నివాసం, రామనాయుడు స్టూడియో, సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఉదయం నుంచి ఈ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
* వరంగల్ రూరల్ జిల్లా అక్కను బస్సెక్కించేందుకని వెళ్లి ఆ బస్సు చక్రాల కింద పడి ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం కట్రాపెళ్ళిలో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్కను బస్సెక్కించేందుకు తల్లితో కలిసి బస్సు వద్దకు వచ్చిన ఐదేళ్ల చిన్నారి ప్రైవేట్ స్కూల్ బస్ కింద పడి మృతి చెందింది.
* ప్రేమ జంటకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని కుద్దలోర్ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తొరపడి గ్రామానికి చెందిన స్వాతి, కొట్టనలంపాకమ్ గ్రామానికి చెందిన మదన్ ప్రేమించింది. ఇద్దరు గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీళ్ల పెళ్లికి స్వాతి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో పాటు మదన్ మరిచిపోవాలని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కుద్దలోర్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. కదులుతున్న రైలు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే లోకో పైలట్ స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చాడు. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల తల్లిదండ్రులకు, బంధువులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు.
* మార్కాపురం : గత నెల 13న పెద్దారవీడు మండలం కలనూత లలో వేటగాళ్లు జింకను వేటాడి చంపి మాంసంను తిని, విక్రయించిన కేసులో నిర్లక్ష్యం వహించారనే అభియోగంతో మార్కాపురం అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వీరేశలింగం నాయుడు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫకృద్దిన్, పురుషోత్తమాచారి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ధనలక్ష్మి, కార్యాలయం వాచ్‌మెన్ వెంకటలక్ష్మమ్మలను ను సస్పెండ్ చేస్తూ గుంటూరు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎన్.ప్రదీప్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారని మార్కాపురం డిఎఫ్‌ఓ ఖాదర్‌భాషా తెలిపారు. తాజాగా ఈ కేసులో సోమవారం అటవీ క్షేత్ర అధికారి టి.రమేష్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు అందాయని డిఎఫ్‌ఓ విలేకరులకు తెలిపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వన్యప్రాణులతో పాటు అటవీసంపదను కూడా కాపాడాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందని డిఎఫ్‌ఓ తెలిపారు. ఈ సంఘటనతో నల్లమల్లలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు.
* భువనేశ్వర్:- వందలాది మంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన సంఘటన అస్సాం రాష్ట్రం నాగామ్ జిల్లా కంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఘిలానీ గ్రామానికి చెందిన హిప్జూర్ రహ్మాన్ అనే వ్యక్తిని ఓ కేసు విషయంలో అరెస్టు చేశారు. దీంతో రహ్మాన్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో అతడు మానసిక క్షోభకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితుడు బంధువులు రహ్మాన్ కుటుంబానికి న్యాయం చేయాలని కంపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రహ్మాన్ బంధువులతో చర్చలు జరుపుతుండగా కొందరు రాళ్లతో స్టేషన్‌పై దాడి చేశారు. రాళ్ల దాడి చేసిన గుంపును పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వంద మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. అదనపు బలగాలను పిఎస్ కు తరలించి దాడిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
* నకిలీ పత్రాలతో విదేశీ మహిళను భారతీయ మహిళగా చూపి తప్పుడు పాస్‌పోర్టు పొందడానికి ప్రయత్నించిన కేసులో నేరం రుజువు కావ డంతో భార్య భర్తలకు రాజంపేట జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏడాది జైలు శిక్ష, రూ.20 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిం చారు. ఇందుకు సంబంధించి మన్నూరు ఎస్‌ఐ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా…రాజంపేట మండలం తిమ్మిశెట్టిపల్లెకు చెందిన విశ్వనాధరెడ్డి జీవనోపాధి కోసం కువైత్‌కు వెళ్లాడు. అలాగే శ్రీలంక నుంచి బతుకుదెరువు కోసం దిశానాయకే ముడియన్ సిలగేనంద అనే శ్రీలంక మహిళ కువైత్‌కు వచ్చింది. వీరి మధ్య సాన్ని హిత్యం పెరిగి వివాహం చేసుకున్నారు. అనంతరం వీరు ఇండియాకు వచ్చారు. తిరిగి కువైత్‌కు తీసుకెళ్లేందుకు విశ్వనాధరెడ్డి తన భార్య ముడియన్‌సిలగేనందకు తప్పుడు ధ్రువ పత్రాలతో తిమ్మిశెట్టి నంద పేరిట పా్‌సపోర్టు పొందడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పాస్‌పోర్టు విచారణాధికారి ఆర్.వి.నరసింహారావు 2016వ సంవత్సరం జూలై నెల 27వ తేదీ గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మన్నూరు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుపై రాజంపేట జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. మంగళవారం నేరం రుజువైనందున నిందితులు తిమ్మిశెట్టి నంద, ఆమె భర్త విశ్వనాధరెడ్డికి రూ.20వేల జరిమానాతో పాటు ఏడాదిపాటు జైలు శిక్ష విధించినట్లు మన్నూరు ఎస్‌ఐ పి.హనుమంతు తెలిపారు.