‘2020 సిక్కు రెఫరెండం’ యాప్‌పై టెక్ దిగ్గజం గూగుల్ వెనక్కి తగ్గింది. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ డిమాండ్ మేరకు యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మేరకు పంజాబ్ సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు ఈ యాప్ వల్ల భారత్‌లో ఉద్భవించే ప్రమాదాల్ని వివరిస్తూ అమరీందర్ సింగ్ కేంద్రానికి, భద్రతా అధికారులకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకొని యాప్‌ని ప్లే స్టోర్ నుంచి తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గూగుల్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రత్యేక ఖలిస్థాన్‌కు అనుకూలంగా ఉన్నవారు తమ మద్దతును ఓటింగ్ రూపంలో తెలిపేలా ఈ యాప్‌ని రూపొందించారు. అయితే, దీన్ని పంజాబ్ ప్రభుత్వం డీఐటీఏసీ ల్యాబ్‌లో క్షుణ్నంగా సమీక్ష చేయించింది. ఓటింగ్ చేసేవారి సమాచారం ‘సిక్స్ ఫర్ జస్టిస్’(ఎస్‌ఎఫ్‌జే) వేర్పాటువాద సంస్థ ఆధ్వర్యంలో ఉన్న వెబ్‌సర్వర్‌లో నిక్షిప్తం అవుతున్నట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో సమాచార సాంకేతికత చట్టం 79 (3) బి ప్రకారం ఈ యాప్‌ని భారత్‌లో నడపడం చట్టవిరుద్ధమని గూగుల్ లీగల్ సెల్‌కు లేఖ రాశారు.
ఖలిస్థాన్ అనుకూల యాప్‌ను తొలగించిన గూగుల్
Related tags :