NRI-NRT

తానా కేర్స్ అధ్యక్షుడిగా పెద్దిబోయిన జోగేశ్వరరావు

Peddiboyina Joe Nominated As TANA Cares Chairman-తానా కేర్స్ అధ్యక్షుడిగా పెద్దిబోయిన జోగేశ్వరరావు

విద్యా, వైద్యం, ఇమ్మిగ్రేషన్, సామాజిక సేవా తదితర రంగాల్లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సేవ విస్తృతిని పెంపోంచేందుకు ఏర్పాటు చేసిన ఆ సంస్థ నూతన విభాగం “తానా కేర్స్” అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా పేరూరుకు చెందిన డెట్రాయిట్ ప్రవాసాంధ్రుడు పెద్దిబోయిన జోగేశ్వరరావు నియమితులయ్యారు. ఫిలడెల్ఫియాలో సెప్టెంబరులో నిర్వహించినా తానా కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. తానా టీంస్క్వేర్, బ్యాక్‌ప్యాక్, కంటి వైద్య శిబిరాలు, క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు, 5కె వాక్ తదితర కార్యక్రమాల ద్వారా తానా ప్రవాసులకు, మాతృభూమికి చేస్తున్న సేవకు అనుగుణంగానే తానా కేర్స్‌ను బలోపేతం చేసి సభ్యులకు సంస్థను, సేవా కార్యక్రమాలను దగ్గర చేసేందుకు కృషి చేస్తానని జోగేశ్వరరావు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన తానా అధ్యక్షుడు తాళ్లూరి జయ్శేఖర్‌కు, కార్యవర్గ సభ్యులకు జోగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.

1998లో అమెరికాకు వచ్చిన పెద్దిబోయిన, డెట్రాయిట్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. నోవై నగర జోనింగ్ బోర్డు సభ్యుడిగా ఆయన ప్రస్తుతం కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానిక తెలుగు సంఘం(DTA)తో పాటు పలు జాతీయ స్థాయి సంస్థల్లో కీలక విభాగాల్లో సభ్యుడిగా సేవలందించారు. ఆయన నిర్వహించిన పలు బాధ్యతల వివరాలు దిగువ చూడవచ్చు.
* 2006: మిషిగన్ షిర్డీ సాయిబాబా ఆలయ సభ్యుడిగా
* 2009: TIE ప్రచార సమన్వయకర్త
* 2010: ఇండో అమెరికన్ కాస్ బోర్డు సభ్యుడు. శ్రీ వేంకటేశ్వర ఆలయ కార్యవర్గ సభ్యుడు.
* 2011: డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు
* 2013-15 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధి, తానా సభల కార్యవర్గ సభ్యుడు, టీంస్క్వేర్ కార్యకర్తగా సేవలు.
* 2017-19: ILA(Indian League of America) కోశాధికారి
* 2018: ఐటీసర్వ్ తాత్కాలిక అధ్యక్షుడు
* 2016-19: నోవై నగర జోనింగ్ బోర్డు సభ్యుడు. ప్రస్తుతం ఈ బోర్డు అధ్యక్షుడు.