DailyDose

ఉప్పల్ ప్లాట్లకు రూ.200కోట్లు-వాణిజ్య-04/08

uppal hmda layouts sold as hotcakes

* హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్‌ భగాయత్‌ భూముల లే-అవుట్‌ ప్లాట్ల ఈ వేలానికి కొనుగోలుదారుల నుంచి ఫుల్‌ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది. ఆదివారం రెండు విడతలుగా వేలం వేయగా మొత్తం రూ. 202 కోట్ల ఆదాయం సమకూరింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి విడత వేలంలో 31,865 గజాలకు రూ. రూ.64.54 కోట్లు, మధ్యాహ్నం రెండో విడతలో 22,472 గజాలకు రూ. 138 కోట్లు వచ్చాయి. రెండు దశల్లో గజానికి కనిష్టంగా రూ. 57, 000, గరిష్టంగారూ. 73,900 ధర పలికింది. సాయంత్రం వరకు వేలం ప్రక్రియ కొనసాగింది. ఈ వేలం సోమవారం కూడా జరుగనుందని హెచ్‌‌‌‌ఎండీఏ తెలిపింది.
* దేశీ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో పాజిటివ్‌గా ఉన్నిప్పటికీ మిడ్‌ సెషన్‌నుంచి అమ్మకాల వెల్లువెత్తింది. 2019 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా అధికార పార్టీ బీజేపీ మ్యానిఫెస్టో విడుదల ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ఒకదశలో డే హై నుంచి ఏకంగా 400పాయింట్లు కుప్పకూలడం గమనార్హం. లాభనష్టాల మధ్య భారీ ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది.
*లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) విలీనానికి ఇంకా ఆమోదం తెలుపలేదని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ విలీనానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, విలీనం కాబోయే సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
*ఎన్‌ఐఐటీ, ఇతర ప్రమోటర్ల నుంచి ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో 30 శాతం వాటా కొనుగోలుకు బేరింగ్‌ ప్రైవేటు ఈక్విటీ ఏషియా (బీపీఈఏ) సిద్ధమైంది. ఇందుకోసం రూ.2,627 కోట్లు వెచ్చించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది.
*రూ.50 లక్షల్లోపు టర్నోవరు కలిగిన సర్వీస్‌ ప్రొవైడర్లు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) సమ్మిళిత పథకానికి మారేందుకు ఏప్రిల్‌ 30 వరకు గడువు ఉందని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) వెల్లడించింది.
*రుణదాతల చేతిలో ఉన్న ప్రైవేట్‌ రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా విక్రయానికి బిడ్డింగ్‌ ప్రక్రియ నేడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బిడ్‌ పత్రాలకు తుదిరూపు ఇవ్వాల్సి ఉందని సంబంధిత వర్గాల సమాచారం.
*వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూలో విదేశీ మదుపర్లు రూ.18,000 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని, ఇందులోనూ ప్రధానంగా వొడాఫోన్‌ గ్రూపే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టబోతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
*కంపెనీల నాలుగో త్రైమాసిక ఫలితాలు సూచీలకు దిశానిర్దేశం చేయొచ్చు. 12న ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌లు ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండొచ్చన్న స్కైమెట్‌ అంచనాలు స్వల్పకాలంలో సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. ఈ నెలాఖరున భారత వాతావరణ శాఖ ప్రకటించనున్న వర్షపాత అంచనాలు కీలకం కానున్నాయి.