చాలాసార్లు మనకు రెండు రకాల మనుషులు తారస పడుతుంటారు. తమకంటే చదువులో, సిరిసంపదల్లో, పదవిలో, కళల్లో ఎక్కువ స్థాయి ఉన్నవారు ఎదురైతే ఆత్మన్యూనతా భావానికి లోనయ్యేవారు మొదటి రకం. వీరు కుంగిపోతుంటారు. మరో రకం మనుషులు తమకన్నా ఉన్నతులు కనిపిస్తే వారిని చూసి అసూయపడతారు. ద్వేషించడం మొదలుపెడతారు. ఇక్కడ ప్రభువు చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ‘మీ ప్రేమ గొప్పది కావాలంటే ఎదుటివారిలోని చెడ్డగుణాలను అసహ్యించుకుని, మంచివాటిని గుండెల్లో పెట్టుకోవాలి. ఒకరినొకరు గొప్పగా భావించాలి. మిమ్మల్ని హింసించేవారిని కూడా దీవించాలి.’ అని ఉద్బోధించారు. ఇతరుల్లోని సుగుణాలను అర్థం చేసుకుని, వాటిని ఆపాదించుకోవడంలోనే మనిషి గొప్పదనం ఉంటుందన్నది ఆయన ఉపదేశం. ‘తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడ’న్నది క్రీస్తు వాక్కు.
హింసించినా ప్రేమించడం క్రీస్తు తత్త్వం
Related tags :