*లోక్‌సభ ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టుబడింది. నారాయణగూడ పైవంతెన వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా మొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తమకు వచ్చిన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు వాహనంలోని రూ.8కోట్లు పట్టుకున్నారు. ఈ డబ్బంతా భాజపా ఫండ్‌గా పోలీసులు పేర్కొంటున్నారు. హిమాయత్ నగర్ సర్కిల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తొలుత ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి నుంచి సుమారు రూ.2కోట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు నారాయణగూడలో ఓ బ్యాంకు వద్ద మిగతా వారు ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మరో రూ.6కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు చేపట్టి నగదు పట్టుకుంటున్నప్పటికీ ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటం ఇదే తొలిసారి. అదుపులోకి తీసుకున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
* మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్
ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వేలకోట్ల రూపాయలను ప్రభుత్వ బ్యాంకులకు ఎగవేసి లండన్‌కు పారిపోయిన పారిశ్రామిక వేత్త మాల్యాను భారత్‌కు రప్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఊరట కలిగింది. భారత్‌కు రప్పించే చర్యలకు వ్యతిరేకంగా మాల్యా అభ్యర్థనను లండన్ కోర్టు సోమవారం తోసిపుచ్చింది. దీంతో మాల్యాను త్వరలోనే దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉంది.
*పర్సులో ఈ కార్డు ఉంటె చాలు, మెట్రో, బస్సు, క్యాబ్ ఏదైనా ఎక్కోచు. త్వరలో హైదరాబాద్ వాసుల కోసం అందుబాటులోకి రానున్న ఈ కామన్ మొబలిటి కార్డు పై రాష్ట్ర రవాణా శాఖ కసరత్తులు చేసి ఐటీ శాఖకు ప్రపోజల్ పెటింది. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్లు పిలిచి కార్డు తయారీ పనులు అప్పగించనున్నారు అధికరులు. ఈ కార్డులో క్యూ ఆర్ కోడ్, స్వీపింగ్ ఉంటాయి. వీటితో పాటు నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా స్పెసిఫికేషన్లు కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
*హైదరాబాద్ నగరంలో వర్ష కురుస్తోంది. సోమవరం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయిది. ఉదయం నుంచి ఎండతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. పలుచోట్ల భారీ వర్ష కురుస్తోంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ పంజాగుట్ట, బొరబండ మియాపూర్, ఎస్సార్ నగర్, లింగంపల్లి, చందానగర్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.
* వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులకు పులివెందుల కోర్టు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది. తొలుత విధించిన కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, వంట మనిషి కుమారుడు ప్రకాశ్‌కు తొలుత 12 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు సోమవారంతో పూర్తి కాగా.. మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది.
* ఇంగ్లాండ్‌లో మే 30నుంచి జరగబోయే 2019 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 15న జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 23 వరకూ ఐపీఎల్లో ఆటగాళ్ల ప్రదర్శన గమనించి వాళ్ల బ్యాటింగ్ స్థానాలు నిర్ణయించనున్నట్లు సమాచారం. ఇప్పటికీ నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్, నాలుగో పేస్ బౌలర్ స్థానాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా ఆ మిగిలిన ఆటగాళ్లను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.
* పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. పీఎంవో ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. బిల్డింగ్‌లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలిస్తున్నారు. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే.. సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్ ఆదేశాలు ఇచ్చారు.
*సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం నిధుల్ని మంజూటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి రూ. 145,86,04,280 మంజూరు చెస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ దివ్వేది పేరుతొ జీవోను సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వ్యులు జరీ చేసింది. విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో వివిధ పద్దుల కింద జమ కానున్నాయి. ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగుల టీఏ, డీఏ రవాణా ఎన్నికల సామాగ్రీ పనులకు వీటిని వినియోగిస్తారు.
*రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికలో తెలుగు బాషా వికాసం, సంస్కృతీ పరిరక్షణకు స్థానం కల్పించకపోవడం బాధాకరమని తెలుగు భాషా పరిరక్షణ సంఘం ఉభయ రాష్ట్రాల అద్యక్షుడు ఒంటరు శ్రీనివాసులు రెడ్డి రచయితల సంఘం కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో మాతృబాషలో చదువుకున్న వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని అలాంటి ప్రోత్సహాకాలను ఏపీలో ఎ పార్టీ ప్రకటించకపోవడం శోచనీయమని అన్నారు.
*అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తాం. సాధారణంగా ఉదయం ఏడు నుంచి సాయంత్రం అయిదు వరకు పోలింగ్ జరగాలి. నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో మాక్ పోలింగ్ పూర్తి చేయటానికి సమయాన్ని మార్చాల్సి వచ్చింది’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ వెల్లడించారు.
*ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం అప్పారెడ్డిపల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. పలు చోట్ల మార్కెట్ యార్డులలో ధాన్యం తడిసిపోయింది. మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. దేవరకొండ, కొండమల్లేపల్లి, పెద్దఅడిశర్లపల్లి, కట్టంగూర్, నకిరేకల్, కేతేపల్లి, అడ్డగూడూరు, తుంగతుర్తి, నూతనకల్, జాజిరెడ్డి, కనగల్ తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.
*సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సంగారెడ్డి జిల్లావాసి చిత్రామిశ్రా 20వ ర్యాంకు సాధించి సత్తాచాటారు. వారి కుటుంబానిది బిహార్ అయినప్పటికీ.. 27ఏళ్ల క్రితం సంగారెడ్డికి వచ్చి స్థిరపడింది. టీకూమిశ్రా, విజయనాథ్ దంపతుల కుమార్తె చిత్రామిశ్రా. ఆమె తండ్రి సంగారెడ్డి జిల్లా ఫసల్వాదిలోని గణపతి చక్కెర పరిశ్రమలో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
*ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. భక్తుల మధ్యనే తిరుగుతూ వారిని భయకంపితులను చేస్తున్నాయి. ఆదివారం ఆలయ సమీపంతో పాటు తిరువీధుల్లో వరాహాలు ఇలా తిరుగుతూ కనిపించాయి. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఉద్యానవనాలను కూడా అవి ధ్వంసం చేస్తున్నాయి. వీటిని కట్టడి చేయడానికి తితిదే అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
*దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర సాంకేతిక విద్యాసంస్థల పనితీరు ఆధారంగా..కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నుంచి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేం వర్క్(ఎన్ఐఆర్ఎఫ్)ను సోమవారం విడుదల చేస్తారు. ఈ ఏడాది ఎన్నికల కోడ్ ఉన్నందున, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విడుదల చేయనున్నట్లు.. శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వరంగల్ ఎన్ఐటీ గతేడాది జాతీయ స్థాయి ర్యాంకింగ్‌లో 25వ స్థానం సాధించగా, ఈసారి మరింత మెరుగైన స్థానం రావచ్చని నిట్ వర్గాలు భావిస్తున్నాయి.
*తెలంగాణలో డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనికోసం రాష్ట్రప్రభుత్వంతో రాష్ట్ర వైమానిక అకాడమీ, సెయింట్ లిమిటెడ్‌లు త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.
*గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీసుస్టేషన్ సీఐగా ఉన్న బి.ఆదినారాయణను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుతం వేకెన్సీ రిజర్వులో ఉన్న ఏ.అలహరిని సీఐగా నియమించింది. గుంటూరు జిల్లా ఎస్పీ, గుంటూరు రీజియన్ ఐజీల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
*రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికల్లో తెలుగు భాషా వికాసం, సంస్కృతి పరిరక్షణకు స్థానం కల్పించకపోవడం బాధాకరమని తెలుగు భాషా పరిరక్షణ సంఘం ఉభయ రాష్ట్రాల అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రచయితల సంఘం కార్యదర్శి జింకా సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.
*అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం వేటు వేసింది. సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వైకాపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. స్పందించిన ఈసీ.. సీఐ నారాయణరెడ్డిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచమని ఆదేశించింది.
*ఒప్పందం ప్రకారం ఎలాంటి వివాదాల్లేకుండా కొనుగోలుదారుకు ప్లాట్‌ను అప్పగించాల్సిన బాధ్యత డెవలపర్ కంపెనీపైనే ఉంటుందని జాతీయ వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. వివాదాల పరిష్కారం నిమిత్తం కొనుగోలుదారు నుంచి అదనంగా సొమ్ము వసూలు చేయడం చెల్లదని స్పష్టం చేసింది.
ఎనిమిది కోట్లు పట్టేశారు-తాజావార్తలు–04/08
Related tags :