చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వామి శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్య వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై రంగరాజన్ హర్షం వ్యక్తం చేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధి గొల్లలని కూడా వంశపారంపర్యం కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వం అవగాహనా లోపంతో అర్చకులను పదవీ విరమణ చేయించిందని, హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతమున్న నాలుగు కుటంబాలలో ఇద్దరి చొప్పున ప్రధాన అర్చకులుగా నియమిస్తే, న్యాయపరమైన సమస్యలు కూడా ఉండవని సూచించారు. టీటీడీపై భక్తులకున్న మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
మంచి నిర్ణయం. నేను హర్షిస్తున్నాను.
Related tags :