రొటీన్ కథానాయిక పాత్రల్లో నటించి బోర్ కొట్టినట్టుంది రాశీ ఖన్నాకు. అందుకే ఇకపై సామాజిక బాధ్యత కలిగిన కథానాయిక పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ‘ఇమైకా నొడిగల్’, ‘అడంగ మరు’, ‘అయోగ్య’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా ‘సంగ తమిళన్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఓ తమిళ చిత్రం సహా మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘భవిష్యత్తులో కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించాలని అనుకున్నా. అందులోనూ సామాజిక బాధ్యత కలిగిన కథానాయిక పాత్రలకు ప్రాముఖ్యత ఇస్తా. కాస్త గ్లామర్ పాత్రలో నటించాలని కొందరు దర్శక, నిర్మాతల నుంచి ఆహ్వానం వచ్చింది. అయినా అందులో నటించడం లేదు. నటనకు ప్రాధాన్యతనిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా’నని వివరించింది.
రొటీన్ కథలు బోరు కొట్టాయి
Related tags :