ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో వచ్చే నెలాఖరులోగా పురపాలక, నగరపాలక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇప్పటికే 64 పురపాలక సంఘాల్లో వార్డులను పునర్విభజిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల జనాభాను లెక్కించి ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నారు. మరో 21 పురపాలక సంఘాల్లో వార్డుల పునర్విభజనకు తాజాగా ఆదేశాలు వెలువడ్డాయి. మిగతా వాటిల్లోనూ మరో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఏపీలో పురపాలిక ప్రణాళికలు
Related tags :