ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఓ బాలీవుడ్ చిత్రానికి దిల్లీ కోర్టు స్టే ఇచ్చింది. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో ‘చందా: ఏ సిగ్నేచర్ దట్ రూయిండ్ ఏ కెరీర్’ అనే టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోందని.. దానిని వెంటనే నిలిపివేయాలని కోరుతూ చందా కొచ్చర్ ఇటీవల దిల్లీ కోర్టును సంప్రదించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ తనను అపరాధిగా చూపించే విధంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. చందా కొచ్చర్ ఫిర్యాదుపై సమీక్షించిన దిల్లీ కోర్టు సదరు సినిమా విడుదలపై స్టే విధించింది. ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ సినిమా విడుదల చేయకూడదని ఆదేశించింది. అంతేకాకుండా ప్రత్యేక్షంగా కానీ, పరోక్షంగా కానీ చందా కొచ్చర్ పేరును వాడకూడదని పేర్కొంది. ఈ విషయంపై చందాకొచ్చర్ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ విలేకర్లతో మాట్లాడారు. ‘చందాకొచ్చర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సినిమాని తెరకెక్కిస్తున్న సదరు చిత్రబృందం ఇప్పటివరకూ ఆమెను సంప్రదించలేదు. ‘చందా’ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న నటి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ఒక్క సంతకంతో చందాకొచ్చర్ కెరీర్‌ను ఎలా నాశనం చేసుకున్నారో ఈ సినిమాలో చూపించబోతున్నామని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తాను చందాకొచ్చర్ ఆహార్యాన్ని బాగా అనుసరించానని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు.’ అని విజయ్ అగర్వాల్ తెలిపారు.
చందా వద్దంది
Related tags :