Devotional

డిసెంబరు 26న శబరిమల ఆలయం మూసివేత

Sabarimala Temple Will Be Closed On December 26th 2019

ప్రస్తుతం ఎక్కడ చూసినా, అయ్యప్ప భక్తుల శరణుఘోషతో దేవాలయాలు మార్మోగుతున్నాయి. రెండు నెలల పాటు దర్శనమిచ్చే శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులందరూ దీక్షలు స్వీకరిస్తున్నారు. మరికొందరు ఇప్పటికే స్వామిని దర్శించుకుని తరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 26న సూర్యగ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని 4గంటల పాటు మూసివేయనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు ప్రకటన వెలువరించింది. ఆరోజు ఉదయం 7.30గంటల నుంచి ఉదయం 11.30నిమిషాల వరకూ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. డిసెంబరు 26న సూర్యగ్రహణం ఉదయం 8.06గంటలకు ప్రారంభమై 11.13నిమిషాలకు ముగుస్తుంది. ఈ సందర్భంగా నెయ్యాభిషేకంతో సహా ఆలయంలో ఏ పూజలను నిర్వహించరు. ఆలయాన్ని తెరిచిన తర్వాత పుణ్యహవచన చేసి అనంతరం పూజలు కొనసాగించనున్నట్లు అయ్యప్ప ఆలయ ఈవో తెలిపారు. కేవలం అయ్యప్పస్వామి ఆలయం మాత్రమే కాదు, మాలికాపురం, పంబలో ఉన్న ఆలయాలను సైతం సూర్యగ్రహణం నేపథ్యంలో మూసివేయనున్నారు. మండల మకరవిళక్కు సందర్భంగా నవంబరు 17న అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.