కెనడాలోని కాల్గరీలో శ్రీ సత్య సాయిబాబా 94వ జన్మదిన వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కాల్గరీ శాఖ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అనుపిండి సత్యసాయి జన్మ విశిష్టతలు, బోధనలు, ప్రార్థనల గురించి వివరించారు. డాక్టర్ జయశ్రీ తాతే భట్ సాయి మహిమలు, భగవద్గీత శ్లోకాల వివరణ ఇచ్చారు. సుందర్ కృష్ణమూర్తి తన బృందంతో కలిసి భజనలు ఆలపించారు. కియాన్ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస విశిష్టతలను వివరించారు. సత్య సాయి పాఠశాల చిన్నారులు నాటిక రూపంలో సాయి ప్రబోధనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 350కి పైగా కుటుంబాలు పాల్గొన్నాయి.
కెనడాలో ఘనంగా సత్యసాయి 94వ జయంతి వేడుకలు
Related tags :