సెయింట్ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్‌కు అద్భుత స్పందన లభించింది. 20జట్లు ఈ పోటీలో తలపడ్డాయి. పూల్ ఏ, పూల్ బీ అని రెండు భాగాలుగా టీంలను విభజించి నాట్స్ ఈ టోర్నమెంట్ నిర్వహించింది. పూల్ ఏలో వీబీ అడిక్ట్స్ అద్భుతంగా ఆడి విజేతగా నిలిచింది. రౌడీస్ టీం రన్నరప్ గా నిలిచింది. పూల్ బీ లో కూల్ డూడ్స్ టీం విన్నర్స్ , ధ్వని టీం రన్నర్స్ ట్రోఫీని దక్కించుకున్నాయి. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కోఆర్డినేటర్ నాగ శిష్ట్లా, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ నాయకులు సతీష్ ముమ్మనగండి, పవన్ దగ్గుమాటి, పవన్ కొల్ల తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహాణలో కీలకపాత్ర పోషించారు. టీఏఎస్ ప్రెసిడింట్ సురేంద్ర బాచిన, టీఏఎస్ ట్రెజరర్ రంగ సురేశ్, టీఏఎస్ డైరక్టర్ జగన్ వేజండ్ల స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీనివాస్ కొటారు, విజయ్ బుడ్డి, అప్పలనాయుడు, శివ మామిళ్లపల్లి తదితరులు క్రీడాకారులకు బహుమతులు అందించారు. టోర్నమెంట్ విజయవంతానికి కృషి చేసిన వారిని నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి అభినందించారు.
సెయింట్ లూయిస్‌లో నాట్స్ వాలీబాల్ పోటీలు
Related tags :