* గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో పుష్కర ఘాట్ వద్ద కృష్ణానదిలో గురజాల దేవదాయ శాఖ ఈవోగా పనిచేస్తున్న అనిత. మృతదేహం లభ్యం వయసు 28 సంవత్సరాలు భర్త రమేష్ ఆమెకు ఇద్దరు పిల్లలు కావ్య శ్రీసుజన్.
* అక్రమంగా అరెస్టు చేయడం దారుణం. విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ కార్మికుల విన్నపం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ కార్మికుల అరెస్టు చేసి తీసుకు వచ్చినారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఉన్న కార్మికులు మాట్లాడుతూ తాము న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మె చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలు పరిష్కరించకపోవటం దరుణమన్నారు ఐదు రోజులు దాటుతున్నా తమకు ఇప్పటివరకు వీధుల్లో తీసుకోలేక పోతున్నారని కనీసం చర్చలకు పిలవలేక పోతున్నారని ఆర్టీసీ కార్మికులు ఆవేదనకుగురైయ్యారు మంగళవారం బోధన్ డిపో ఎదుట విధులకు తీసుకోమని వెళ్లగా తమకు అక్రమంగా అరెస్టు చేసి బోధన్ మరికొంతమందికి రుద్రూర్ పోలిస్ స్టేషన్కు తరలించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు ఇప్పటికే చాలా మంది కార్మికులు మృతి చెందడం జరిగింది అని ప్రైవేటు వ్యక్తులు బస్సులు నడిపించటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి చాలా మంది మృతి చెందుతున్నారని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు ఇప్పటికైనా విధుల్లోకి కార్మికులకుల తీసుకోవాలన్నారు వారితో పాటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు.
* Banjarahils ps limits రోడ్డు నంబర్ 12 లో రోడ్డు ప్రమాదం.. స్కూటీ నీ ఢీ కొట్టిన అర్ టీ సి బస్సు.. స్కూటీ పై వెళుతున్న యువతి అక్కడికక్కడే మృతి.. రోడ్ నెంబర్ 12 లో తీవ్ర ట్రాఫిక్ జాం…మసబ్ టాంక్ నుంచి బంజారా హిల్స్ వేపు వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.. రోడ్డు ప్రమాదం సమాచారం పోలీసులకు అందించిన స్థానికులు… సనగతన స్థలానికి చేరుకున్న పోలీసులు.. Software engineer sohin Saxena spot death. She working at Tata consultant.
* ఓటుకు నోటుపై సుప్రీంలో సత్వర విచారణ పిటిషన్ … _సత్వర విచారణ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వైకాపా ఎంఎల్‌ఏ ఆర్కే హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో వైయస్సార్ కాంగ్రెస్ మంగళగిరి ఎంఎల్‌ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) సుప్రీంకోర్టులో సోమవారం ఎర్లీ హియరింగ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 2017లోనే ఈ పిటిషన్ దాఖలు చేసినా సుప్రీంకోర్టులో లిఫ్టింగ్ కాకపోవడంతో ఆర్కే మరోసారి సుప్రీం తలుపుతట్టారు. తాజాగా 14 ఏళ్ల క్రితం స్టే విధించి చ్రందబాబుపైనే అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ స్టే ఎత్తివేసి విచారణ ప్రారంభించింది. ఇదే సరైన సమయంగా భావించి ఆర్కే పిటిషన్ దాఖలు చేసినట్లుగా చెబుతున్నారు. ఓటుకు నోటు వ్యవహారం ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు వ్యవహారం కలకలమైంది. రాజకీయ కలవరానికి దారితీసింది. 2015లో టీడీపీ మహానాడు సమయంలో ఆనాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఓటు వేయాలని కోరుతూ .. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు 50 లక్షల లంచం ఇవ్వటానికి ప్రయత్నించినట్లు వీడియో హల్‌చల్ చేశా యి. అదే సమయంలో ఎపి సిఎం, టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు సైతం ఆయనతో ఫోన్‌లో మాట్లాడినట్లు వాయిస్ రికార్డులు బయల్పడ్డాయి. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డిని తెలంగాణ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తదనంత ర పరిణామాల్లో ఓటుకు నోటు కేసు వ్యవహారాల్లో అనేకానేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ న్యాయపరంగా విచారణ కొనసాగుతూనే ఉంది. అప్పట్లోనే సుప్రీంకు వెళ్లిన ఆర్కే.. ఇదే కేసుకు సంబంధించి అప్పుడు సిఎంగా ఉన్న చ్రందబాబుపైనే వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే సుప్రీంలో కేసు దాఖలు చేశారు. అందులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఛార్జిషీట్‌లో 52సార్లు చ్రందబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ల్లో మాత్రం చేర్చలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలో వద్దో ఏసీబీ కోర్టు నిర్ణయిస్తుందంటూ ఆర్కే పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంలో సవాల్ చేశారు. ఆర్కే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులిచ్చింది.
* వందల సంఖ్యలో పోర్న్ తారల అకౌంట్లను తొలగించడంపై పెరుగుతున్న నిరసనలు తారలు జింజర్ బాంక్స్ (ఎడమ), అలనా ఇవాన్స్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఏడాది వందల మంది పోర్న్ తారలు, సెక్స్ వర్కర్ల ఖాతాలు తొలగింపునకు గురయ్యాయి. ప్రధాన స్రవంతి సెలబ్రిటీలతో పోలిస్తే తమను తక్కువ చేసి చూస్తున్నారని, తమకు భిన్నమైన ప్రమాణాలను వర్తింపజేస్తున్నారని వీరిలో చాలా మంది విమర్శిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హాలీవుడ్ నటి షరాన్ స్టోన్ లేదా మరొకరి వెరిఫైడ్ ఖాతా తరహాలో తన ఖాతాను నిర్వహించుకొనే స్వేచ్ఛ ఉండాలని, కానీ అలా చేస్తే తమను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగిస్తారని ‘అడల్ట్ పర్‌ఫార్మర్స్ యాక్టర్స్ గిల్డ్’ అధ్యక్షురాలు అలనా ఇవాన్స్ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోర్న్ నటులను ఖాతాలు నిర్వహించుకోనివ్వాలంటూ పోరాడుతున్న ప్రముఖుల్లో అలనా ఒకరు. ఇన్‌స్టాగ్రామ్ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ తమ ఖాతాలను తొలగించారని 1,300 మందికి పైగా పోర్న్ నటులు చెబుతున్నారు. నగ్న, లేదా సెక్స్ దృశ్యాలేవీ తమ ఖాతాల్లో పెట్టకపోయినా ఇలా చేశారని వీరు విమర్శిస్తున్నారు. వీరందరి వివరాలను అలనా ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రూపు సేకరించింది. జీవనోపాధి కోసం తాము చేస్తున్న పని వాళ్లకు నచ్చదని, అందుకే తమపై వివక్ష చూపిస్తున్నారని అలనా ఆరోపిస్తున్నారు.
* 26/11 ముంబై ఉగ్రదాడి జరిగి 11 ఏళ్లు గడచిన సందర్భంగా ఆ దుర్ఘటనలో అమరులైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రద్ధాంజలి ఘటించారు. ఉగ్రవాద నిర్మూలనకు జాతి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో అమరులైన ప్రతి ఒక్కరినీ తాము స్మరించుకుంటామని ఆయన తెలిపారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉగ్రవాదులతో పోరాడిన భద్రతా దళాలకు జాతి మొత్తం గౌరవ వందనం చేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. ముంబై ఉగ్రదాడిలో అమరులైన వారికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఉగ్రదాడి జరిగి నేటికి 11 ఏళ్లు గడచిన సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కూడా తాను పాల్గొననున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల పాశవిక దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారి అనుభవాలను ఈ కార్యక్రమం ద్వారా తాను తెలుసుకోనున్నట్లు రాజ్‌నాథ్ వివరించారు.
* మొన్న అంగళ్లు సమీపంలో వర్షిత, నిన్న నీరుగట్టువారి పల్లిలో మరో బాలిక, నేడు పిన్ని చేతుల్లో బలైన మరో బాలిక ఇలా నిత్యం ఏదో ఒక చోట పసిమొగ్గలను చిదిమేస్తున్న మృగాలు ఎక్కువ అయిపోయారు. ఇదే నేపథ్యంలో కలికిరి మండలం కొటాల గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల వీరభద్రయ్య అత్యాచారం జరపిన నేపథ్యంలో కలికిరికి చెందిన విధ్యార్థినులు ర్యాలీగా వెళ్లి స్థానిక ఎస్సై రామాంజనేయులుకు ఇలాంటి నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. అదే సమయానికి కొటాల గ్రామ ప్రజలు నిందితుడైన వీరభద్రయ్యను కొడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ణి వారినుండీ రక్షించి తీసుకువస్తున్న సమయంలో పోలీసులను తోసివేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసు సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో పోలీసులపైనే ఎదరు దాడి చెయ్యడంతో పోలీసులు అతణ్ణి చితకబాది పోలీసు స్డేషన్ కు తరలించారు. చట్టాలలోని లొసుగుల సహాయంతో తప్పు చేసిన నిందితులు స్వేచ్చగా తిరుగుతుండటం బాదాకర విషయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఇలాంటి మానవ మృగాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
* కారు అద్దాలు పగులగొట్టి రూ10 లక్షల నగదు దోపిడి చేసి గుర్తు తెలియని దుండగులు. కుప్పం సమీపంలోని వేపనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద కారు అద్దాలు పగలగొట్టి 10 లక్షల నగదు దోపిడీ చేసిన సంఘటన వెలుగు చూసింది .సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి కుప్పం సమీపంలోని వేపనపల్లి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు.అక్కడ తన కారును నిలిపి రిజిస్టర్ కార్యాలయం లోపలికి వెళ్ళాడు. కార్యాలయంలో పనులు ముగించుకొని తిరిగి వచ్చేసరికి కారు అద్దాలను పగులగొట్టి ఉండటం చూసిన సంజీవి కార్ డోర్ తెరిచి చూశాడు. కారు లోపల ఉంచిన డబ్బు సంచి అదృశ్యమైన సంఘటన చూసి అవాక్కయ్యాడు. ఈ సంఘటనపై బాధితుడు సంజీవి వేపనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వేపనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
* ఆఫ్రికాలోని మాలీ దేశంలో హెలికాప్టర్ కూలింది. ఈ ఘటనలో 13 మంది ఫ్రెంచ్ సైనికులు మృతిచెందారు. జిహాదీల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొన్నది. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. దుర్ఘటన పట్ల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యువెల్ మాక్రన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాలీ దేశంలో 2012 నుంచి ఇస్లామిక్ మిలిటెంట్లు విధ్వంసం సృష్టిస్తున్నారు.
* ఈ ఏడాది జవనరి 2వ తేదీన శబరిమల అయ్యప్పస్వామి దర్శనం చేసుకున్న కేరళకు చెందిన బిందు అమ్మాని అనే మహిళపై ఇవాళ ఆందోళనకారులు కారంపొడితో దాడి చేశారు. ఎర్నాకుళం సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసు ఎదుట ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్‌తో బిందు శబరిమల వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే భద్రత కల్పించాలంటూ వాళ్లు పోలీసు కమీషనర్ ఆఫీసుకు వచ్చారు. ఆ సమయంలో బిందుపై కొందరు కారంపొడి, పెప్పర్‌తో దాడి చేశారు. కేరళలోని కన్నూరు వర్సిటీలో బిందు లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. ఇవాళ రాజ్యాంగ దినోత్సవం అని, ఈ సందర్భంగా తాము శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకుంటామని మహిళా హక్కుల కార్యకర్త తృప్తీ దేశాయ్ మీడియాతో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ తమను అడ్డుకోలేరన్నారు. తమకు సెక్యూర్టీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాము మాత్రం ఆలయానికి వెళ్తామన్నారు.
* నకిలీ హెల్మెట్లు దేశ రాజధాని ఢిల్లీలో తయారవుతున్నాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విచారణలో బయటపడింది. ఇటీవల సైబరాబాద్ రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసస్ మానిటరింగ్ సెల్ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ఈ హెల్మెట్లను నాసిరకం సామగ్రితో తయారుచేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇవి ధరించిన వారికి ఏమా త్రం సురక్షితం కాదని స్పష్టమైంది. ఇలా దాదాపు 40 కంపెనీలకు చెందిన వారు నాసిరకం హెల్మెట్లను తయారుచేసి వాటికి ఐఎస్‌ఐ లోగోను పెట్టి బ్రాండెడ్ వస్తువుగా అమ్మేస్తున్నారని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను పెట్టి 10మందిని గుర్తించి వారిపై కేసులను నమోదు చేశారు. ఈ నాసిరకం హెల్మెట్లను రూ.100 నుంచి 200 వరకు తయారు చేసి వాటిని మార్కెట్‌లో రూ.250 నుంచి 500 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. హెల్మెట్‌కు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ ట్రాఫిక్ సూచనలు ఇలా… * ఎప్పుడు నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేయొద్దు. * ఐఎస్‌ఐ మార్క్‌తో మోసపోవద్దు. * నాసిరకం హెల్మెట్లు ధరిస్తే ప్రాణాలు కాపాడవు. * నాసిరకం హెల్మెట్ ధరిస్తే నాట్ వేరింగ్ హెల్మెట్ కింద కేసులను నమోదు చేస్తాం. * ద్విచక్రవాహనంపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా వాహనం నడిపించే వ్యక్తి తోపాటు వెనకాల కూర్చున్న వారు కూడా చట్ట ప్రకారం హెల్మెట్ ధరించాలి. ఈ ఇద్దరు కాకుండా నాలుగు సంవత్సరాలు వయస్సు దాటి ఉంటే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. సైబరాబాద్ పరిధిలో ఈ ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 720 మంది చనిపోయారు. అందులో 94 శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం, నాసిరకం హెల్మెట్ ధరించి తీవ్ర గాయాలకు గురై మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాహనదారుల సురక్షితం కోసం ప్రయోగాత్మకంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మొదటి సారిగా చేపట్టిన ఈ డ్రైవ్ మంచి ఫలితాలను ఇస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. నాసిరకమైన హెల్మెట్ బ్రాండ్‌లు… పిర్‌స్టో సోనాక్స్-1* ఓజోన్* హూడ్* వేమార్ * యూనికాప్స్ * కోర్‌లాక్స్ * పవర్, మ్యాక్స్-1 డీలార్డ్ * బాన్స్ * ఎన్‌ఎక్స్‌టీ *సన్‌స్టార్ * సైరాంగ్ * సఫర్ * ఈస్టర్ *చాంప్ * సాలిడ్-ఎక్స్ * తాజ్-1 * ఓక్స్‌జెమ్ *టైగర్ *రిటెక్స్ *బైకర్ *ఏబీపీ *స్టోన్ *జేవీఎమ్ *టిస్సీ *అరా *దేవ్ * స్పీడ్ *హీరో * ఓరియన్ *రాక్‌స్టార్ *అర్మాక్స్ *సైజస్ *హ్యాపీ లైఫ్ *రియాషో *రిలీఫ్ *ఏవోన్ *గ్లోబల్.