DailyDose

జేసీ కుటుంబానికి సుప్రీం కోర్టు నోటీసులు-తాజావార్తలు-11/27

JC Diwakar Reddy Family Summoned By Supreme Court-Telugu Breaking News-11/27

* ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీమంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చుక్కెదురైంది. త్రిసూల్ సిమెంట్ కంపెనీకి లైమ్ స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జేసీ కుటుంబ స భ్యులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. త్రిసూల్ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్ణీత సమయంలో నిర్మించలేదని, దానికి కేటాయించిన లైమ్ స్టోన్ గనులు రద్దు చేయాలన్న పిటిషన్‌పై హై కోర్టులో బుధవారం విచారణ జరిగింది.
*అవినీతికి పాల్పడుతూ ఓ గ్రామ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మూడుచింతలపల్లి మండలం ఉద్దేమార్రి గ్రామ వీఆర్వో వెంకటేశం రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు.
*ఆరుగురు నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నేడు చోటుచేసుకుంది. లొంగిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. వీరిపై రూ.31 లక్షల 50 వేల రివార్డు ఉంది.
*షావోమి రెడ్‌మి నోట్ 8లో కాస్మిక్‌ పర్పుల్‌ వేరియంట్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. గత నెలలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ సందర్భంగా దీనిపై అంచనాలను వెలువరించింది. రెడ్‌మి నోట్ 8 కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్ అమెజాన్‌, ఎంఐ.కాం ద్వారా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. కొత్త కాస్మిక్ పర్పుల్ కలర్ ఎంపికతో పాటు, ఇతర కలర్‌ ఆప్షన్లలో కూడా ఈ స్మార్ట్‌ ఫోన్‌లభిస్తుంది.
* రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు.
* వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా 2,36,000 మందికి లబ్ధి కలిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి మాట్లాడుతూ వాహన మిత్ర ద్వారా లబ్ధిదారులకు రూ.236 కోట్ల మేర ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. రెండో విడతలో రూ.63 కోట్లు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. వస్తున్న దరఖాస్తులను విశ్లేషించి ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు.
* వైసీపీ నవరత్నాలన్నీ నవ భూతాలేని, వీటివల్ల ప్రజలకు ఉపయోగం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.
* రాగల 24 గంటల్లో కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు దిశ నుంచి వీస్తున్న గాలులతో రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గుతున్నాయి. దీంతో క్రమంగా చలి పెరుగుతోంది. మరో రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం వుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
* రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్‌ చంద్రబాబును ప్రశ్నించారు.
* వైఎస్సార్‌ వాహన మిత్ర ద్వారా 2,36,000 మందికి లబ్ధి కలిగిందని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజిక్కడ మంత్రి మాట్లాడుతూ వాహన మిత్ర ద్వారా లబ్ధిదారులకు రూ.236 కోట్ల మేర ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు * వైసీపీ నవరత్నాలన్నీ నవ భూతాలేని, వీటివల్ల ప్రజలకు ఉపయోగం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కడప జిల్లాలో మూడో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. మాతృభాష పిల్లలకు సులభవంగా అర్థమయ్యేదన్నారు.
* కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలోని హెచ్‌పీసీఎల్‌ పైప్‌లైన్‌ మరమ్మతులకు గురికావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి పెట్రోలు లీకైంది. బుధవారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పెనుగంచిప్రోలు పోలీసులకు సమాచారం అందజేశారు
* ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. అజెండాలో 14 అంశాలు, టేబుల్ ఐటమ్‌గా 2 అంశాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకానికి ఆమోదముద్ర కేబినెట్ వేసింది. కాపు సామాజిక వర్గం మహిళలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
*శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
* ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సు ట్రాకింగ్‌ యాప్‌(బస్సు, సర్వీసు నంబర్లు కొట్టగానే అది ఎక్కడుందో తెలిపే) సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్‌ఎం బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత గుత్తేదారు సంస్థ మారుతున్నందున ఈ నెల 27నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు వెహికల్‌ ట్రాకింగ్‌ సేవలను ఆపేస్తున్నామన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.
*రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆధ్వర్యంలో 20 ఇంజనీరింగ్ కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు.
నిబంధనలు పాటించని, కనీస వసతులు కల్పించని కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం.
*సింగరేణి కాలరీస్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బి.వీరారెడ్డి ఈస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌)గా నియమితులయ్యారు. నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ మంగళవారం ఇందుకు ఆమోదముద్ర వేసింది. జనవరి 1 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది.
*ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో వైద్యవిద్యను (ఎంబీబీఎస్‌) అభ్యసించే పేద విద్యార్థులు రుణ సదుపాయం పొందేందుకు వీలుగా భారత వైద్యమండలి (ఎంసీఐ) ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రైవేటు వైద్య కళాశాలలు విద్యార్థుల నుంచి ఏటా రూ.7లక్షల నుంచి రూ.25లక్షల వరకూ ఫీజు వసూలు చేస్తుంటాయి. ఎంసీఐ బోర్డు గవర్నర్లు ఇటీవల భారతీయ బ్యాంకుల అధికారులతో సమావేశమైనప్పుడు ఈ విషయం ప్రస్తావించి విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించాలని కోరారు.
*అవినీతి, ఇతరత్రా ఆరోపణలెదుర్కొంటున్న ఆదాయపుపన్ను అధికారులపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. 21 మంది అవినీతి అధికారులకు నిర్బంధ పదవీ విరమణను ప్రకటించింది. వీరంతా గ్రూప్‌-బి ర్యాంకు అధికారులని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ 21 మందితో కలిపి జూన్‌ నుంచీ ఇలా నిర్బంధ పదవీ విరమణకు గురైన అధికారుల సంఖ్య 85కు చేరింది.
*చలికాలంలో సాధారణ వైరల్‌ జ్వరాలతో పాటు స్వైన్‌ఫ్లూ విజృంభించే అవకాశాలు ఉండడంతో.. వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో స్వైన్‌ఫ్లూ చికిత్స కోసం ప్రత్యేక వార్డులు నెలకొల్పామని.. ఈ బాధితుల కోసమే 500 పడకలను ఏర్పాటు చేశామన్నారు.
*రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధిపతి జి.సతీశ్‌ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ (ఆర్‌ఏఈఎస్‌) ఆయనకు గౌరవ ఫెలోషిప్‌ను ప్రదానం చేసింది.
*మహిళా, శిశు సంక్షేమ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చూపితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ హెచ్చరించారు. అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో అర్హులకు సేవలందించాలని, ప్రతి పథకం నూటికి నూరుశాతం విజయవంతం కావాలని అన్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌లో స్త్రీ, శిశు సంక్షేమ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.
*విశ్రాంత ఉద్యోగుల చిరు కోరికలను యాజమాన్యం తీర్చాలని ఎన్టీపీసీ మాజీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హైదరాబాద్‌ అధ్యక్షుడు శివ బద్దెన కోరారు. కవాడిగూడలోని ఎన్టీపీసీ ప్రాంతీయ కార్యాలయం ముందు విశ్రాంత ఉద్యోగులు మంగళవారం ధర్నా చేశారు.
*తెలంగాణలో విత్తనోత్పత్తి, శుద్ధి, నాణ్యత పరీక్షలకు సహకారం అందిస్తామని నెదర్లాండ్స్‌ ప్రతినిధులు హామీ ఇచ్చారు. నెదర్లాండ్స్‌ వ్యవసాయ రంగ ప్రతినిధి ఈ.ఎ.వేన్‌ డిజి, ప్రధాన విధాన సలహాదారు పూజా చౌదరిలు మంగళవారం రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయానికి వచ్చారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులతో చర్చించారు. వేన్‌ డిజి మాట్లాడుతూ విత్తన శుద్ధికి ఆధునాతన పరిజ్ఞానాన్ని అందిస్తామన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌కు, విత్తన పరీక్షల ప్రయోగశాలకు సహకరిస్తామన్నారు.
*అమరావతిలో 2015లో ఏర్పాటు చేసిన జాతీయ ఆకృతుల సంస్థ (ఎన్‌ఐడీ) జారీ చేసిన డిగ్రీలు, డిప్లొమోలపై స్పష్టత ఇవ్వాలని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ కోరారు. జాతీయ ఆకృతుల సంస్థ (సవరణ) బిల్లు-2019పై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
*సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తూ… ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌పై ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాసిన కె.గురుమూర్తికి రెండు నెలలపాటు సెలవుపై వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. సెలవు ముగిసిన తర్వాత ఆయన మాతృశాఖలో రిపోర్టు చేయాలని, తదుపరి సెలవు కావాలనుకుంటే అక్కడి నుంచే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
*అగ్రిగోల్డ్‌లో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి ప్రభుత్వం సాయం అందించినా కొన్ని జిల్లాల్లో సాంకేతిక సమస్యల కారణంగా డబ్బు అందడం లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.
*వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, ఇతర అంశాలపై నియమించిన మంత్రుల బృందానికి (జీఓఎం) సలహాలిచ్చేందుకు ఉన్నతాధికారులతో ఒక వర్కింగ్‌ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.
*చేపల దాణా చట్టంరూపకల్పనకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మత్స్యశాఖ కమిషనర్‌ సభ్య కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ డీన్‌ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తారు.
*అభ్యంతరం లేని ప్రభుత్వస్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణ కోసం అర్హులు ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని భూపరిపాలన శాఖ మంగళవారం సూచించింది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిలో 100 గజాలలోపు రూపాయి వంతున, 100-300 చదరపు గజాలున్న వారికి కలెక్టరు ఖరారుచేసిన మార్కెట్‌ విలువ అనుసరించి క్రమబద్ధీకరణ చేస్తామని అధికారులు తెలిపారు
*ముఖ్యమంత్రికి అదనపు ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌కు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు నెలకు రూ.2.5 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తారు
*ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ విభాగం ఎస్పీగా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అవినీతి నిరోధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌గా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
* తమిళ నటుడుదర్శకుడు భాగ్యరాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెల్‌ఫోన్ల కారణంగా మహిళలు చెడిపోతున్నారంటూ ఆయన మండిపడ్డారు. వివాహేతర సంబంధం కోసం భర్తనిపిల్లలను చంపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలు కట్టుబాట్లను వదిలేస్తున్నారని భాగ్యరాజా మండిపడ్డారు.