Movies

నో కామెంట్స్

Actress Oviya Speaks On Politics In Tamilnadu-నో కామెంట్స్

తమిళంలో ‘కలవాణి’, ‘కాంచన3’, ‘90ఎంఎల్‌’ తదితర చిత్రాల్లో నటించి, బిగ్‌బాస్‌తో ఇమేజ్‌ పెంచుకున్న యువతార ఓవియాకు అవకాశాలు తగ్గినా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. దీంతో ప్రైవేటు కార్యక్రమాలకు ఆమెను అతిథిగా ఆహ్వానిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇటీవలే కోవైలో జరిగిన ఒక కార్యక్రమానికి ఓవియా అతిథిగా హాజరైంది. ఆ సందర్భంగా ఆమెపై విలేకరులు పలు ప్రశ్నలు సంధించారు. అప్పుడు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ కలిసి రాజకీయాలు చేయాలనుకుంటున్న అంశాన్ని ప్రస్తావించగా, ఓవియా సమాధానాన్ని దాటవేసింది. ఆ తరువాత ఆమె ట్విట్టర్‌లో.. రాజకీయాల్లో లేని తారలు రాజకీయాల గురించి అడగొద్దు అంట ఒక ట్వీట్‌ చేసింది. రాజకీయాలపై ప్రజాభిప్రాయాలను తెలుసుకుంటే వాస్తవాలు బయటకొస్తాయని ఉచిత సలహా కూడా ఇచ్చింది.