అమెరికాలోని నకిలీ యూనివర్శిటీలో చేరిన 90 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఫార్మింగ్టన్ నకిలీ యూనివర్శిటీని మూసివేసిన హోంల్యాండ్ సెక్యూరిటీ అందులో చేరిన 250 మంది విద్యార్థులను అరెస్టు చేసింది. వారిలో 90మంది భారతీయ విద్యార్థులున్నారని తేలింది. మార్చి నెలలోనూ నకిలీ యూనివర్శిటీలో చేరిన 161 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ యూనివర్శిటీ అని విద్యార్థులకు తెలిసినా, తరగతులు జరగకున్నా వారు చేరారని ఫెడరల్ పోలీసులు చెప్పారు. అమెరికాలో నాణ్యమైన విద్య పొందాలనే కలతో యూనివర్శిటీలో చేరిన విద్యార్థులను అరెస్టు చేయడం క్రూరమైన చర్యగా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి సెనేటర్ ఎలిజబెత్ వారెన్ అభివర్ణించారు. కాగా నకిలీ విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థులు అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన వీసాతో చట్టబద్ధంగానే అమెరికాకు వచ్చారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల అరెస్టుతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరో 90మంది నకిలీ విద్యార్థుల అరెస్ట్
Related tags :