ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో బూతుల సంస్కృతిని ప్రోత్సహించేందుకే సీఎం తెలుగు భాష వద్దంటున్నారా? అని నిలదీశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మంత్రుల భాష మీద ప్రజలు వివరణ కోరుతున్నారని అన్నారు. వారికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార అహంకారంతో జగన్ ఇలా మంత్రులతో మాట్లాడిస్తున్నారా? లేక అభివృద్ధి చేయలేకపోతున్నామనే అసహనంతో ఇలాంటి భాష వస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టి ముగింపు దశకు తీసుకొచ్చామని చెప్పారు. వాటిని అందుబాటులోకి తీసుకురావటానికి వైకాపా సర్కార్‌కు చేతులు రావట్లేదని దేవినేని ఉమా మండిపడ్డారు.
సీఎం సమాధానం చెప్పాలి
Related tags :