NRI-NRT

ప్రియాంకా మృతితో రగులుతున్న ప్రవాసులు

ప్రియాంకా మృతితో రగులుతున్న ప్రవాసులు-USA NRIs Want Priyanka Rapist Murders Be Hanged-Demands KCR Govt-Candle Light Vigil For Priyanka In USA

* నేరస్థులను ఉరితీయాలని డిమాండ్
* టెక్సాస్, న్యూజెర్సీ, జార్జియాల్లో కొవ్వొత్తులతో నివాళి

వెటర్నరీ యువ వైద్యురాలు డా.ప్రియాంక రెడ్డిని అతి కిరాతకంగా అత్యాచారం చేసి, హత్య చేసి, పెట్రోల్ పోసి తగల్బెట్టిన మానవ మృగాలు నలుగురినీ ఉరి తీయాలని అమెరికాలోని ప్రవాసులు పెద్ద గొంతుకతో కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేపిస్టులు కనిపిస్తే కాల్చివేత వంటి చట్టాలు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ప్రవాసంలో మాతృదేశాలకు దూరంగా ఉండే తమలాంటి వారిని ఇలాంటి వార్తలు కలవరపెట్టడమే గాక మానసికంగా కుంగుబాటుకు గురి చేస్తున్నాయని, అలాంటిది ప్రియాంక కుటుంబంలో నెలకొన్న అలజడిని రూపుమాపే ఏకైక మందు నిందితులను ఉరితీయడమేనని ప్రవాసులు ఆకాంక్షిస్తున్నారు. ఆటా ఆధ్వర్యంలో అట్లాంటాలో, న్యూజెర్సీలో, డల్లాస్‌లో పలు తెలుగు సంఘాలు ఈ వారాంతం కొవ్వొత్తులతో ప్రియాంకకు నివాళులు అర్పించనున్నాయి.

Image may contain: 1 person, smiling, text