Movies

హెగ్డే గుడ్డు కథ

puja hegde diet plan

కథల ఎంపికలో కథానాయికలు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలీదు గానీ, తినే ఆహారం విషయంలో మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. మరింత నాజూకుగా కనిపించాలంటే, ఆ మాత్రం నోరుని కట్టేసుకోవడం తప్పదు. అయితే ఒక్కో కథానాయిక డైట్‌ ఒక్కోలా ఉంటుంది. మరి పూజా హెగ్డే ఆహార నియమాలేంటంటే… ‘‘జంక్‌ ఫుడ్‌కి నేను దూరం. కాఫీ, టీ తీసుకోను. కాఫీ వాసన, ఆ రుచి నాకు పడవు. ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీళ్లు తాగుతా. అల్పాహారంగా రెండు గుడ్లు తీసుకుంటా. ఒక్కోసారి ఉడకబెట్టిన గుడ్లు, ఒక్కోసారి ఆమ్లెట్‌, ఇంకోసారి ఎగ్‌ పరోటా.. ఇలా మెనూ మారుతూ ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన వంటకం ప్రసిద్ధి. అలాంటి వంటకాల్ని మాత్రం బాగా ఆస్వాదిస్తాను. ఏం తీసుకున్నా… పరిమితంగానే ఉండాలి. లావైపోతారన్న భయంతో చాలామంది రైస్‌ తీసుకోవడం లేదు. నేనలా కాదు. ఏం తిన్నా.. జిమ్ములో కరిగించుకోగలను అనే నమ్మకంతో ఉంటాను. అలాగని మితిమీరిన ప్రయోగాలు చేయను’’ అంటోంది పూజా. తను కథానాయికగా నటించిన ‘మహర్షి’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.