Business

రాయితీపై రైతుబజార్లలో ఉల్లి విక్రయాలు

YS Jagan Offers Subsidized Onions In RythuBazars

ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కర్నూలు మార్కెట్‌లో మంగళవారం ఉల్లి రికార్డు ధర పలికింది. నిన్న క్వింటా రూ.10,180 పలికిన ఉల్లి ధరలు ఇవాళ మరింత ఎగబాకి క్వింటా రూ.10,220 పలికింది. నిన్నటితో పోల్చితే క్వింటాలుకు రూ.40 అధిక ధర పలికింది. ఉల్లి దిగుబడులు క్రమంగా తగ్గుతుండటమే దీనికి ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. మరో వైపు మహారాష్ట్ర, గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోవటం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఉల్లి ధరలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. ప్రజలపై ఉల్లి భారం పడకుండా చర్యలు తీసుకోవాలని, ఉల్లి ధర తగ్గే వరకు కిలో రూ.25కే రైతు బజార్లలో విక్రయించాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి రాయితీ భరించాలని మార్కెటింగ్‌ శాఖను సీఎం ఆదేశించారు. ఉల్లిని అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్కెటింగ్‌, విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. 18 రోజుల్లో 16వేల క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసి సరఫరా చేశామని అధికారులు వెల్లడించారు.