ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. క్రిస్మస్ పండుగ నాడు క్రిస్మస్ చెట్టును కానుకలతో అలంకరించడం క్రైస్తవులకు ఒక సాంప్రదాయం. ఈ విలువైన కానుకలను తమ ప్రియతములకు అందించి తమ ప్రేమాభినాలను చాటుకుంటారు. కొందరైతే తరతరాలుగా తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన విలువైన ఆభరణాలతో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. అయితే స్పెయిల్‌కు చెందిన బహియా నగరంలోని కెంపెన్సీ హోటల్‌లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ఖరీదైన క్రిస్మస్ ట్రీ ఇక్కడ దర్శనమివ్వనున్నది. దాదాపు 107 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగార నగలు, ఖరీదైన రత్నాలతో ఈ క్రిస్మస్ చెట్టును ముస్తాబు చేస్తున్నారు.
ఈ క్రిస్మస్ చెట్టు ధర ₹107కోట్లు
Related tags :