ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. తిరుపతిలో తన పార్టీ కార్యకర్తలతో సమావేశమైన వేళ మధ్యలో శబరిమలలో మహిళల ప్రవేశం గురించిన ప్రస్తావన వచ్చిన వేళ ఒక్కో మతాన్ని ఒక్కో ధర్మం ఉంటుందని దాన్ని అందరూ పాటించాల్సిందే అని అన్నారు. శబరిమల గురించి తన భార్య అన్నా లేజినోవా తనను ప్రశ్నించిందని గుర్తు చేసుకున్నారు. శబరిమలకు తనెందుకు వెళ్లరాదని ఆమె తనను అడిగిందని అన్నారు. పవన్ దానికి నువ్వు చర్చికి వెళ్లినప్పుడు తలపై చీర కొంగును ఎందుకు కప్పుకున్నావు అని అడిగానన్నారు. దానికి సమాధానంగా లెజీనోవా అది తమ సంప్రదాయమని చెప్పిందన్నారు. మీకు మీ సంప్రదాయం లాగానే ఒక్కో ధర్మానికి ఒక్కో ఆచారం ఉంటుందని తానూ బదులిచ్చానని అన్నారు. అయ్యప్పస్వామి బ్రహ్మచారని అనునిత్యమూ తపస్సులో ఉంటారు కాబట్టి మహిళలను ఆయన చూడరాదని అందువల్లే మహిళలకు అక్కడ ప్రవేశాం లేదని తన భార్యకు వివరించానన్నారు.
నేను శబరిమలకు ఎందుకు వెళ్లకూడదు?
Related tags :