Business

ధరలు పెంచి తీరతామంటున్న మారుతీ

Maruti Announces Mandatory Price Hikes For 2020-ధరలు పెంచి తీరతామంటున్న మారుతీ

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి ధరలు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ముడిసరకుల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ‘‘ముడిసరకుల ధరల ప్రభావం కంపెనీ తయారు చేసే వాహనాలపై తీవ్రంగా పడనుంది. ఈ ప్రభావాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకోసమే జనవరి 2020 నుంచి వివిధ మోడళ్లపై ధరలను పెంచుతున్నాము’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. ఏ మోడళ్లపై ధరలు పెరగనున్నాయో మాత్రం ఈ ప్రకటనలో వెల్లడించలేదు.
ఈ కంపెనీ తయారు చేసే ఆల్టో, ఎస్‌-ప్రెస్సో, వేగనార్‌, స్విఫ్ట్‌, సెలిరియో, డిజైర్‌, సియాజ్‌ దేశీయ విక్రయాలు గతవారం 3.2శాతం తగ్గాయి. కంపెనీ 1,41,400 వాహనాలను స్థానిక డీలర్లకు అందజేసింది. దీనికి అదనంగా టయోటాతో కలిసి గ్లాన్జా మోడల్‌కు చెందిన 2286 వాహనాలను విక్రయించింది.