నెల్లూరు జిల్లాలో తెదేపాకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. శుక్రవారం తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని ఈ సందర్భంగా లేఖలో ఆయన పేర్కొన్నారు. మస్తాన్‌రావు వైకాపాలోకి వెళతారంటూ గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్తాన్‌రావు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం ఆయన వైకాపాలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వైకాపాలో చేరికను మస్తాన్‌రావు ఇంకా ధ్రువీకరించలేదు.
తెదేపాకు బీద మస్తాన్‌రావు బై బై
Related tags :