జీన్స్, లెగ్గింగ్స్, జెగ్గింగ్స్ ధరించినప్పుడు సౌకర్యంగా ఉండే షార్ట్ కుర్తాలు బెటర్ ఛాయిస్. కాటన్, సింథటిక్ మెటీరియల్స్‌లో దొరికే ఈ చిట్టిపొట్టి కుర్తాలు స్టయిలిష్ లుక్ తెచ్చిపెట్టడంతో పాటు ‘షార్ట్ అండ్ స్వీట్’గా కనిపిస్తాయి!
లతలు, పువ్వుల డిజైన్లు ఉన్న షార్ట్ కుర్తాలు యాంకిల్ లెంగ్త్ జీన్స్ మీదకు సూటవుతాయి. ఈ డ్రెస్‌కు పెన్సిల్ హీల్స్‌ను మ్యాచ్ చేస్తే చూడముచ్చటగా కనిపించవచ్చు.
చికన్ వర్క్ కుర్తాల్లో షార్ట్ లెంగ్త్ కూడా ఉంటాయి. ఇవి కాలేజీ అమ్మాయిలకు చక్కగా సూటవుతాయి. సినిమాలు, షికార్లకు ఈ రకం కుర్తాలు అనువైన స్టయిల్!
షార్ట్ కుర్తా ఫుల్ హ్యాండ్స్ వేసినా, షార్ట్ హ్యాండ్ ఉన్నా, స్లీవ్‌లెస్ అయినా…. ఎలా ఉన్నా అందంగానే ఉంటుంది. కాబట్టి సందర్భాన్ని బట్టి అనువైన కుర్తా ఎంచుకోవాలి!