*ప్రభుత్వం 9,000 కిలోల బంగారాన్ని వేలం వేసింది. ఇటీవల ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు చెందిన కొందరు అధికారులు ధ్రువీకరించారు. గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా ప్రభుత్వం మధ్యకాల, దీర్ఘకాల డిపాజిట్ల కింద సేకరించిన బంగరాన్ని విక్రయించాలని నిర్ణయించింది. దీంతో వ్యవస్థలోకి నగదు ప్రవాహం కూడా పెరిగింది. ప్రభుత్వం గోల్డ్‌మానిటైజేషన్ స్కీం కింద మొత్తం ఫిబ్రవరి 20నాటికి 15,650 కిలోల బంగారాన్ని సేకరించింది. వీటిల్లో 6,584 కిలోల బంగారం స్వల్పశ్రేణి బాండ్ల కింద, 2,938 కిలోల బంగారం మధ్యశ్రేణి కింద, 6,128 కిలోల బంగారం దీర్ఘశ్రేణి బాండ్ల కింద సమీకరించింది. ఈ స్కీం కింద ప్రభుత్వం 2.5 శాతం వడ్డీరేటును చెల్లించడంతో పాటు చివర్లో బంగారం మొత్తానికి సమానమైన నగదును ఇస్తుంది. ప్రజల వద్ద నిరుపయోగంగా పడిఉన్న బంగారాన్ని వ్యవస్థలోకి తెచ్చేందుకు ఈ స్కీంను ప్రభుత్వం 2015లో ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద 1-3ఏళ్ల వ్యవధిని స్వల్పకాలికంగా, 5-7ఏళ్ల వ్యవధిని మధ్యకాలికంగా, 12-15ఏళ్ల వ్యవధిని దీర్ఘకాలికంగా పరిగణిస్తారు. ఈ క్రమంలో భాగంగా మధ్య, దీర్ఘశ్రేణి డిపాజిట్ల కింద సేకరించిన బంగారాన్ని విక్రయించారు. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ 9,000 కిలోల బంగారం వేలం పూర్తి చేసింది.
*రూ.50 లక్షల వరకు జీవిత బీమా సదుపాయంతో క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్) కింద మదుపు చేసే వీలును ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ అందిస్తోంది. బీమా సదుపాయం నిమిత్తం అదనంగా ఎటువంటి రుసుం చెల్లించనక్కర్లేదని తెలిపింది.
*వేతన బకాయిలను ఈనెల 14 లోగా అందించాలని డిమాండ్ చేస్తూ, జెట్ ఎయిర్వేస్ నూతన యాజమాన్యానికి పైలట్ల సంఘం (నేషనల్ ఏవియేటర్స్ గిల్డ్-నాగ్) లీగల్ నోటీస్ జారీ చేసింది. పైలట్లు, ఇంజినీర్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ ఏడాది జనవరి నుంచి వేతనాలు అందలేదు.
*గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం రూ.12 లక్షల కోట్లు కాగా, రూ.50,000 కోట్లు తక్కువగా వసూలైనట్లు ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
*స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అన్ని కాలపరిమితి రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా 0.05 శాతం మేర తగ్గించింది.
* హైదరాబాద్ సమీపంలోని అరబిందో ఫార్మాకు చెందిన ఒక ఔషధ తయారీ యూనిట్లో యూఎస్ఎఫ్డీఏ బృందం తనిఖీ చేసి పలు అభ్యంతరాలు లేవనెత్తింది. యూనిట్-16లో తనిఖీ చేసిన ఈ బృందం పది అభ్యంతరాలతో కూడిన ‘ఫామ్: 483’ జారీ చేసినట్లు తెలిసింది.
*దేశీయ విమానాలను పెంచే విషయంలో అన్ని విమానయాన సంస్థలు ఒక వ్యక్తిగత మధ్యకాల ప్రణాళికతో ముందుకు రావాలని భారత వైమానిక నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
*దేశీయ విమానాలను పెంచే విషయంలో అన్ని విమానయాన సంస్థలు ఒక వ్యక్తిగత మధ్యకాల ప్రణాళికతో ముందుకు రావాలని భారత వైమానిక నియంత్రణాధికార సంస్థ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.
*ప్రైవేటు రంగ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద షేర్లు రాణించడంతో సూచీలు బలంగా పుంజుకున్నాయి.
*లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను టేకోవర్ చేయడానికి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సిద్ధంగా ఉంది. ఒక వేళ ఆర్బీఐ ఆ విలీనానికి అంగీకరించకపోతే ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా జరిగినా.. లక్ష్మీ విలాస్ బ్యాంక్ మాత్రం ఆకర్షణీయ లక్ష్యంగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
*ఈ ఏడాది (2019)లో 7.3 శాతం, వచ్చే ఏడాది 7.5 శాతం వృద్ధిరేటును భారత్ సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. పెట్టుబడులు పెరుగుతుండటం, వినియోగం గణనీయంగా ఉండటం ఇందుకు కారణాలని పేర్కొంది.
*ఒకప్పుడు ఏదైనా సంక్షేమ పథకం కింది స్థాయి దాకా అమలవ్వాలంటే చాలా దశలు దాటాల్సి వచ్చేది. కానీ డిజిటల్ యుగంలో ఇపుడు మీట నొక్కితే ఇక్కడ లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడిపోతున్నాయి. ఇదీ ఇ-పాలన అంటే.
* పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.5,450 కోట్లు సమీకరించేందుకు లలిత్పూర్ పవర్ జనరేషన్ కంపెనీతో కలిసిబజాజ్ ఎనర్జీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. రూ.5,150 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో మరో రూ.300 కోట్ల వరకు విలువైన బజాజ్ పవర్ షేర్లను విక్రయించనున్నారు.
* బకాయిలు చెల్లించడానికి ఏకకాల సెటిల్మెంట్ ప్రణాళికకు ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియం ఆమోదం తెలిపిందని ఔషధ సంస్థ పనేసియా బయోటెక్ వెల్లడించింది.
* ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అగ్రగామి టెలికాం సంస్థ నుంచి ఆర్డరు లభించినట్లు రామ్‌కో సిస్టమ్స్తెలిపింది. ఆర్డరు విలువను తెలుపలేదు.
* పాలీక్యాబ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ చివరి రోజున 51.65 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా 1.76 కోట్ల షేర్లను జారీ చేయగా.. 91 కోట్లకు పైగా షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
* రూ.33.51 కోట్ల రుణ బకాయిలు చెల్లించడానికి యెస్ బ్యాంక్‌తో ఏకకాల సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు ఆప్టూ సర్క్యూట్స్ వెల్లడించింది.
* ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్, విటారన్ ఎలక్ట్రానిక్స్‌లో చెరో 18.1 శాతం వాటాను రూ.13 కోట్లకు టెక్‌మహీంద్రా కొనుగోలు చేయనుంది.
* ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో 944 ఫ్లాట్లతో కూడిన అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి స్థిరాస్తి సంస్థ అరిహంత్ గ్రూప్ రూ.250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
* ఆస్ట్రేలియా బొగ్గు గని కోసం భూగర్భ జల నిర్వహణ ప్రణాళికకు ప్రభుత్వ అనుమతి లభించినట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది.
భారత్‌లో 10టన్నుల బంగారం వేలం-వాణిజ్య-04/10
Related tags :