పోలీసుల ప్రకారం… ఆ జంట ఆరేళ్ల కింద సామూహిక వివాహాల్లో భాగంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకో అప్పుడు పెళ్లి జరిగిన ఫీల్ వాళ్లకు కలగలేదు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సంప్రదాయబద్ధంగా నంగల్జాత్ గ్రామంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తన పెళ్లికి తానే లేటుగా వచ్చి… ఊహించని షాక్ తిన్నాడు ఆ పెళ్లి కొడుకు. ఉత్తరప్రదేశ్… బిజ్నూర్‌లోని నంగల్జాత్ గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల ప్రకారం… ఆ జంట ఆరేళ్ల కింద సామూహిక వివాహాల్లో భాగంగా పెళ్లి చేసుకున్నారు. ఎందుకో అప్పుడు పెళ్లి జరిగిన ఫీల్ వాళ్లకు కలగలేదు. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సంప్రదాయబద్ధంగా నంగల్జాత్ గ్రామంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ కారణంగా… ఈ ఆరేళ్లూ… ఆమె అత్తారింటికి కూడా వెళ్లలేదు. అయితే అతనితో రెండోసారి జరుగుతున్న పెళ్లి విషయంలో రెండు కుటుంబాల్లో కట్నం విషయంలో తేడా వచ్చింది. వెంటనే వరుడు, అతని బంధువుల్ని అక్కడే బంధించారు. అంతేకాదు… పెళ్లి కూతురి కోసం తెచ్చిన నగలు, విలువైన వస్తువుల్ని లాగేసుకున్నారు. ఇంతలో… ఆమె మనసు మార్చుకుంది. తల్లిదండ్రులు, ఊరి పెద్దల మాట ప్రకారం… వాళ్ల ఇంటి పక్కన నివసిస్తున్న మరో కుర్రాణ్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుడు, అతని బంధువుల్ని రిలీజ్ చేశారు.
వరుడిని బంధించి మరొకరితో వధువు వివాహం
Related tags :