ఈ వారం చివరికల్లా 10 ఉరి తాళ్లు సిద్ధం చేయాలని బిహార్లోని బక్సర్ జైలుకు ఆదేశాలు అందాయి. నిర్భయ దోషులకు మరణశిక్ష అమలు చేసేందుకే అధికారులు ఇవి తయారు చేయిస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.
నిర్భయ కేసు దోషులకు అతి త్వరలోనే మరణ శిక్ష అమలు చేయడం ఖాయమా? అనేక రోజులు మృత్యువుతో పోరాటం తర్వాత వైద్యవిద్యార్థిని ప్రాణాలు విడిచిన డిసెంబర్ 16 అందుకు ముహూర్తమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ. ఉరి తాళ్లు తయారు చేయాల్సిందిగా బిహార్లోని బక్సర్ జైలుకు ఆదేశాలు వెళ్లడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
10 ఉరి తాళ్లకు ఆర్డర్
“డిసెంబర్ 14కల్లా 10 ఉరి తాళ్లు సిద్ధంగా ఉంచాలని జైళ్ల డైరక్టరేట్ నుంచి మాకు ఆదేశాలు అందాయి. అవి ఎవరి కోసం ఉపయోగిస్తారో మాకు తెలియదు. ఉరి తాళ్ల తయారీలో బక్సర్ జైలుకు మంచి పేరు ఉంది.” -విజయ్ కుమార్ అరోరా, బక్సర్ జైలు ఎస్పీ
బక్సర్ ఉరి తాళ్ల విశేషాలు:
* ఒక్కో ఉరి తాడు తయారీకి 3 రోజులు పడుతుంది. తయారీ అంతా దాదాపుగా చేతి పనే. యంత్రాల వాడకం చాలా తక్కువ.
* ఉగ్రవాది అఫ్జల్ గురుకు మరణశిక్ష అమలుకు బక్సర్ ఉరి తాడునే ఉపయోగించారు.
ఖరీదు ఎక్కువే…
చివరిసారిగా బక్సర్ జైలు సరఫరా చేసిన ఉరి తాడు ధర. 1725. ఉక్కు, ఇత్తడి ధరల ఆధారంగా ఉరి తాడు వెల మారనుంది.
నిర్బయ కేసులో నేరస్థులకు ఉరి ఖరారు.. ఈనెల 16 వతేదీ ఉదయం 5 గంటలకు ఉరిశిక్ష అమలు.