మన శరీరం మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కాల్షియంను శోషించుకునేందుకు విటమిన్ డి ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరుకు, దంతాలు, ఎముకలు దృఢంగా ఉండేందుకు కూడా విటమిన్ డి ఉపయోగపడుతుంది. అయితే మన శరీరంలో విటమిన్ డి తగినంతగా లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ డి లోపం ఉన్నవారు డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో విటమిన్ డి ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. విటమిన్ డి లోపం ఉండి, టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న పలువురు పేషెంట్లకు నిత్యం 5వేల ఇంటర్నేషనల్ యూనిట్స్ మోతాదులో 6 నెలల పాటు సైంటిస్టులు విటమిన్ డి ఇచ్చారు. ఈ క్రమంలో ఆ పేషెంట్లలో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరిగిందని, షుగర్ లెవల్స్ కొంత వరకు తగ్గాయని తేల్చారు. అందువల్ల విటమిన్ డి ఉన్న ఆహారాలను నిత్యం తీసుకుంటే డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇక మనకు విటమిన్ డి సూర్యరశ్మితోపాటు పాలు, చేపలు, కోడిగుడ్లు, మటన్ లివర్, పుట్టగొడుగులలో ఎక్కువగా లభిస్తుంది. ఈ ఆహారాలను నిత్యం తీసుకుంటే విటమిన్ డి లోపం రాకుండా, డయాబెటిస్ బారిన పడకుండా చూసుకోవచ్చు.
విటమిన్ డీ అంటే డయబెటీస్‌కు దడుపు
Related tags :